Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH NEW DISTRICTS RULING START FROM TOMORROW THESE ARE THE NEW REVENUE DIVISIONS AND MANDALAS NGS

AP New Districts: కొత్త జిల్లాల స్వరూపం ఇదే.. ఏది పెద్దది? ఏది చిన్నది? రెవిన్యూ డివిజన్లు.. మండలాలు ఇవే

ఏపీలో ఉనికిలోకి కొత్త జిల్లాలు

ఏపీలో ఉనికిలోకి కొత్త జిల్లాలు

AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటులో కొంత విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటి వరకు పెద్ద జిల్లా కాస్త.. రేపటి నుంచి చిన్న జిల్లా అవుతోంది.. నేటి వరకు కాస్త చిన్న జిల్లాగా ఉన్నది.. రేపటి నుంచి పెద్ద జిల్లాగా మారుతోంది. ఏపీలో మొత్తం 26 జిల్లాలు.. 73 రెవిన్యూ డివిజన్లతో ఏపీ కొత్త స్వరూపం ఇదే.

ఇంకా చదవండి ...
    AP New Districts: రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) స్వరూపం మారిపోతోంది. 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అవుతున్నాయి. కలెక్టర్లు.. ఎస్పీలు కూడా కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ జిల్లాల తాజా స్వరూపం చూస్తే.. కొన్ని జిల్లాల కాస్త వింతగా అనిపిస్తాయి. ముఖ్యంగా మన్నటి వరకు మొన్నటి వరకు పెద్ద జిల్లా కాస్త ఇకపై చిన్న జిల్లాగా మారుతోంది. మరో చిన్నజిల్లా కాస్త పెద్దది జిల్లాగా మారుతోంది. జిల్లాల పేర్ల విషయానికి వస్తే ప్రభుత్వం ముందుగా ప్రకటించిన వాటిలో ఒక్క జిల్లా మినహా ఎలాంటి మార్పులు చేయలేదు. బాలాజీ జిల్లాగా తొలి నోటిఫికేషన్ లో చెప్పినా.. దానిపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో దాన్ని తిరుపతి జిల్లా (Tirupati District)గా మార్చారు. ఈ ఒక్క మార్పు మినహా తొలి నోటిఫికేషన్ లో వచ్చిన జిల్లాల పేర్లతోనే తుది నోటిఫికేషన్ వచ్చింది. జనవరి 25న సీసీఎల్‌ఏ (CCLA) విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ల ఆధారంగా మొత్తం 26 జిల్లాలు ఉండనున్నాయి. ప్రతి లోక్‌సభ స్థానాన్నీ జిల్లాగా ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరుకుంది. రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 73కి చేరనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 52 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. అందులో ఎటపాక, కుక్కునూరు డివిజన్లను తాజాగా రద్దు చేశారు.

    ఆ 50 డివిజన్లకు తోడు కొత్తగా మరో 23 డివిజన్లను ఏర్పాటు చేయనున్నారు. తాజాగా ప్రకటించిన పలాస, చీపురుపల్లి, కొత్తపేట, ఉయ్యూరు, సత్తెనపల్లి, నగరి, శ్రీకాళహస్తి, పత్తికొండ.. ఈ ఎనిమిది డివిజన్లపై కొత్తగా అభ్యంతరాలు, సూచనలను స్వీకరించేందుకు ప్రాథమిక నోటిఫికేషన్లు ఆలస్యమయ్యాయి. ధర్మవరం, కదిరి, కందుకూరు రెవెన్యూ డివిజన్లను కొనసాగించాలని నిర్ణయించింది. మొత్తం 26 జిల్లాల్లో 4 జిల్లాల పరిధిలో నాలుగేసి రెవెన్యూ డివిజన్లు.. 13 జిల్లాల పరిధిలో మూడేసి.. 9 జిల్లాల్లో రెండేసి డివిజన్లు ఉండనున్నాయి.

    ఇదీ చదవండి : ఏపీలో జిల్లా పరిషత్‌ల విభజన ఇప్పట్లో లేనట్టే.. కొత్త జిల్లాలపై మంత్రి బొత్స క్లారిటీ

    కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు :
    1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం
    2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం
    3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ
    4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం
    5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం
    6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం,
    7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ
    8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)
    9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు
    10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)
    11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు
    12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)
    13. ఎన్టీఆర్: విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)
    14. గుంటూరు : గుంటూరు, తెనాలి
    15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)
    16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)
    17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)
    18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు
    19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)
    20. నంద్యాల: ఆత్మకూరు (కొత్త) డోన్(కొత్త), నంద్యాల
    21. అంతపురం: అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్ (కొత్త)
    22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)
    23. వైఎస్ఆర్ కడప: బద్వేల్, కడప, జమ్మలమడుగు
    24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)
    25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)
    26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి

    ఇదీ చదవండి : సైన్స్ కు అందని అద్భుతం.. ఉగాది రోజు సంధ్య వేళ స్వామివారికి సూర్యకిరణాలతో అభిషేకం

    కొత్త జిల్లాలు – మండలాల సంఖ్య
    శ్రీకాకుళం జిల్లా, 30 మండలాలు
    విజయనగరం జిల్లా 27 మండలాలు
    పార్వతీపురం మన్యం జిల్లా, 15 మండలాలు
    అల్లూరి సీతారామరాజు జిల్లాచ 22 మండలాలు
    విశాఖపట్నం జిల్లా, 11 మండలాలు
    అనకాపల్లి జిల్లా, 24 మండలాలు
    కాకినాడ జిల్లా, 21 మండలాలు
    కోనసీమ జిల్లా 22 మండలాలు
    తూర్పుగోదావరి జిల్లా, 19 మండలాలు
    పశ్చిమగోదావరి జిల్లా, 19 మండలాలు
    ఏలూరు జిల్లా 28 మండలాలు
    క్రిష్ణా జిల్లా, 25 మండలాలు
    ఎన్టీఆర్ జిల్లా, 20 మండలాలు
    గుంటూరు జిల్లా, 18 మండలాలు
    బాపట్ల జిల్లా , 25 మండలాలు
    పల్నాడు జిల్లా, 28 మండలాలు
    ప్రకాశం జిల్లా, 38 మండలాలు
    నెల్లూరు జిల్లా, 38 మండలాలు
    కర్నూలు జిల్లా, 26 మండలాలు
    నంద్యాల జిల్లా, 29 మండలాలు
    అనంతపురం జిల్లా, 31 మండలాలు
    శ్రీ సత్యసాయి జిల్లా, 32 మండలాలు
    వైఎస్సార్ కడప జిల్లా ,36 మండలాలు
    అన్నమ్మయ్య జిల్లా, 30 మండలాలు
    చిత్తూరు జిల్లా , 31 మండలాలు
    తిరుపతి జిల్లా, 34 మండలాలు

    ఇదీ చదవండి : శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది.. పవన్ మరో ఆసక్తికర ట్వీట్..? ఎవరిని ఉద్దేశించి

    ఈ పునర్వ్యవస్థీకరణ తరువాత కొన్ని జిల్లాల స్వరూపం మారిపోతోంది. ప్రకాశం జిల్లా (Praksam District) పెద్ద జిల్లాగా మారనుంది. విశాఖ చిన్న జిల్లా కానుంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రకాశం  అతి పెద్ద జిల్లాగా అవతరించనుంది. 928 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విశాఖపట్నం (Visakhapatnam) అతి చిన్న జిల్లాగా ఉండనుంది. జనాభా పరంగా చూస్తే కర్నూలు 23.66 లక్షల జనాభాతో పెద్ద జిల్లా అవుతుంది. అతి తక్కువగా 9.54 లక్షల జనాభాతో అరకు చిన్న జిల్లాగా ఉంది. రెండు గిరిజన జిల్లాలు అల్లూరి, మన్యం.. ఏర్పాటు కానున్నాయి. అల్లూరి జిల్లాలో అతి తక్కువగా 3 నియోజకవర్గాలు ఉన్నాయి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP new districts, AP News, Cm jagan

    తదుపరి వార్తలు