AP New Districts Protest: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 13 జిల్లాల ఏపీని 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తే నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాల పేర్లను కూడా నిర్ణయించింది. అయితే వీటిపై సలహాలు, సూచనల కోసం 30 రోజుల సమయం ఇచ్చింది. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ప్రభుత్వం కోరింది. అందరి దగ్గర నుంచి వచ్చిన సలహాలతో.. తుది నిర్ణయం తీసుకుంటామని.. ఆ తరువాతే తుది నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు (New Districts) పై పలు చోట్ల అభ్యంతరాలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే పెద్దగా అభ్యంతరాలు కనిపించడం లేదు. ప్రధాన ప్రతిపక్షాలు ఏవీ వీటికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం లేదు.. కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం స్థానికంగా కొత్త కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. తమ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని కొన్ని చోట్ల.. తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని మరికొన్ని చోట్ల నిరసనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వివాదాలు కొనసాగుతున్నాయి. జిల్లాల పునర్విభజనను కొందరూ వ్యతిరేకిస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో జిల్లాల పేర్ల విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లా (Anantapuram District)లో నిరసనలు మిన్నంటాయి.
అనంతపురం జిల్లాలో చాలా చోట్ల మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవని.. ఇలాంటి సమయంలో కొత్తగా ఏర్పడే జిల్లాల్లో సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడతారని పేర్కొంటున్నారు. జిల్లాల ప్రకటన విషయంలో హిందూపురం(Hindupuram) కు తీవ్ర అన్యాయం జరిగిందని వైసిపీ నేతలతో పాటు.. ఇతర స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నడుటు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandmuri Balakrishna) సైతం తన మనసులో మాట బయట పెట్టారు.. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగిస్తూనే కొన్ని సూచనల చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుపై రాజకీయాలు చేయడం సరైంది కాదు అన్నారు. అయితే వ్యాపార పరంగా.. పారిశ్రామిక పరంగా హిందూపురం చాలా ముందడుగులో ఉందని.. హిందూపురం జిల్లా కేంద్రంగా సత్యసాయి జిల్లాను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు..
Balayya on New Districts|| జగన్ కు జై కొట్టిన బాలయ్య.. తండ్రి పేరు ప్రస్... https://t.co/xvszYImlG5 via @YouTube #Balayya #AkhandaMassJathara #Jagan #JaganShouldApologizeToNTR @NANDAMURIKALYAN @Mokshagna_Offl @NTarakarathna
— nagesh paina (@PainaNagesh) January 27, 2022
ఓవైపు సత్యసాయి జిల్లా ఏర్పాటుపై జిల్లా అంతటా సంబురాలు జరుగుతుండగా మరోవైపు హిందూపురంలో నిరసన ఎగసిపడుతున్నాయి. హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ అఖిల పక్షం చేపట్టిన బంద్ ఇవాళ కూడా కొనసాగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ కౌన్సిలర్లు వ్యతిరేకిస్తున్నారు. తాము హిందూపురం కోసం ఎంత దూరమైన వెళ్తామమని వైసీపీ నాయకులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : 8 నిమిషాల్లోనే సర్వదర్శనం టోకెన్లు ఫుల్.. సామాన్యుల భక్తుల మాటేంటి..?
తాజాగా హిందుపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ కొనసాగుతున్న నిరసనల్లో భాగంగా ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే అప్రమత్తమైన జేఏసీ నేతలంతా కలిసి.. ఆ యువకుడ్ని ఆపడంతో ప్రమాదం తప్పింది. కానీ ప్రభుత్వం తమ డిమాండ్ ను నెరవేర్చే వరకు ఆందోళనల నుంచి వెనక్కు తగ్గేదేలేదంటున్నారు జేఏసీ నేతలు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP new districts, AP News, Hindupuram, Nandamuri balakrishna, Ycp