Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH NEW DISTRICTS NEW CODE WILL CONTINUE ALL WORKS THESE IS THE NEW CODES NGS

AP New Districts: కొత్త జిల్లాలకు కొత్త కోడ్ లు.. వాటి ద్వారానే కార్యక్రమాలన్నీ అమలు

ఏపీలో మరో కొత్త జిల్లా (ప్రతీకాత్మకచిత్రం)

ఏపీలో మరో కొత్త జిల్లా (ప్రతీకాత్మకచిత్రం)

AP New Districts: ఆంధ్రప్రదేశ్ లోని కొత్త జిల్లాల పాలన కొనసాగుతోంది. 13 జిల్లాలు కాస్త ఇప్పుడు 26 జిల్లాలు అయ్యాయి. మరో జిల్లా ఏర్పాటు దిశగా కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఇకపై కొత్త జిల్లాల్లో కొత్త కోడ్ ద్వారానే పాలన సాగనుంది. ఆ కోడ్ లు ఏంటంటే..?

ఇంకా చదవండి ...
    AP New Districts: ముందుగా చెప్పినట్టే సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఎన్ని
    అభ్యంతరాలు వచ్చినా..  స్వల్ప మార్పులు మినిహా.. అన్ని ముందుగా చెప్పినట్టే ఏపీలో కొత్త జిల్లాలను (AP New District) ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల పేర్లు మార్చడం.. రెవెన్యూ డివిజన్లు పెంచడం మినహా.. తొలి నోటిఫికేషన్ ప్రకారమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు.ఇప్పటికే కొత్త జిల్లాల పాలన కూడా ప్రారంభమైంది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) ఇప్పుడు 26 జిల్లాలుగా, 72 రెవిన్యూ డివిజన్ లు గా మారింది. కొత్తగా ఏర్పడ్డ ఈ 13 కొత్త జిల్లాల్లో అధికారులు, ఉద్యోగులు బాధ్యతలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. స్థానిక ప్రభుత్వాలకు మ్యాపింగ్ చేసేందుకు వీలుగా ఈ కొత్త L.G.D కోడ్‌లను కేటాయించింది. పంచాయత్‌ ఈ-పంచాయత్‌ మిషన్‌ మోడ్‌ కింద ఎంటర్‌ప్రైజ్‌ సూట్‌ (PES‌) పేరుతో రూపొందించే అప్లికేషన్లలో ఈ కోడ్ లను
    వినియోగించనున్నారు స్థానిక అధికారులు..

    కొత్త జిల్లాలకు కేంద్రం కేటాయించిన కోడ్ లు ఇవే..                                  పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అనకాపల్లికి 744, అల్లూరి సీతారామరాజు 745, కాకినాడ 746, కోనసీమ 747, ఏలూరు 748, ఎన్టీఆర్‌ 749, బాపట్ల 750, పల్నాడు 751, తిరుపతి 752,
    అన్నమయ్య 753, శ్రీసత్యసాయి 754, నంద్యాల 755 జిల్లా కోడ్ లను కేంద్ర కేటాయించింది. అయితే ఉమ్మడి జిల్లాలకు మాత్రం 502 కోడ్
    నుంచి 521 కోడ్ వరకు ఉన్నాయి. వాటి ప్రకరమే.. లోకల్ గవర్నమెంట్ కోడ్ లను కేటాయించారు. కేంద్రం రాష్ట్రాలతో పాలనపరంగా సంప్రదింపులు జరిపేందుకు ,  వివిధ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపుల కోసం ఈ LGD కోడ్లను వినియోగించనుంది.

    ఇదీ చదవండి : నేడే ఆ మంత్రులకు లాస్ట్ మీటింగ్.. సాయంత్రం మూకుమ్మడి రాజీనామాలు.. కొనసాగేది ఎవరంటే..?

    మొన్నటి వరకు 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అదనంగా మరో 13 జిల్లాలు చేరాయి.  కొత్తగా మరో 13 పెరిగాయి. ఇకపై ఏపీ 26 జిల్లాలు గా కొనసాగనుంది. అయితే మరో గిరిజన జిల్లా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అదే ఓకే జిల్లాల సంఖ్య 27కు పెరగనుంది. అలాగే కొత్తగా మరో 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. దాంతో మొత్తంగా 72 డివిజన్లు అయ్యాయి.

    ఇదీ చదవండి : రంధ్రంలో రాజ రాజ చోర.. ఎరక్కపోయి వచ్చాడు ఇరుక్కున్నాడు

    కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనల్ని పరిగణలోకి తీసుకుని స్వల్ప మార్పులు మాత్రమే చేసింది. ఆ
    అభ్యంతరాల్లో భాగంగానే ఏజెన్సీ ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం.. పోలవరం ముంపు ప్రాంతాలతో పాటు మరో కొత్త
    జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు గిరిజన జిల్లాలు
    ఉన్నాయి. మరి కొత్తగా మరో కొత్త జిల్లా ఏర్పాటు అవుతుందా లేదా అనేది చూడాలి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP new districts, AP News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు