Andhra Pradesh New Districts: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం... జిల్లాల విభజన చేపట్టి... పాలనా విధులను వికేంద్రీకరించడం, విభజించడంతో... అక్కడి ప్రజలకు ప్రభుత్వాధికారులతో పనులు త్వరగా పూర్తవుతున్నాయి. ఇదివరకటిలా... ప్రభుత్వ కార్యాలయాల కోసం దూరప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సిన అవసరం తప్పింది. ఏపీలో మాత్రం... 13 జిల్లాలే ఉన్నాయి. వాటిని విభజించి... పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 25 జిల్లాలు చేస్తూ... అరకు పరిధిలో మాత్రం 2 జిల్లాలు చెయ్యాలనే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈమధ్య కాలంలో... మరిన్ని కొత్త జిల్లాల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వం మాత్రం 26 జిల్లాలే ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. జిల్లాలతోపాటూ... రెవెన్యూ డివిజన్లు 57 ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారుల కమిటీ... ప్రతిపాదనలను ప్రభుత్వానికి ఇచ్చింది.
కొత్త జిల్లాలు ఏర్పాటైతే.. ఇప్పుడున్న 38 రెవెన్యూ డివిజన్లలో మార్పులు చేయాలనీ... కొత్తగా 9 రెవెన్యూ డివిజన్లు తేవాలనీ, అలాగే ఆల్రెడీ ఉన్న వాటిలో 3 రద్దు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. అలాగే... పోలీస్ స్టేషన్ల హద్దులు, పరిధులు కూడా మారనున్నాయి. విద్య, ఆరోగ్యం, అటవీ, వాణిజ్యపన్నులు, ఇంజినీరింగ్ వంటి శాఖల్లో కూడా మార్పులు రానున్నాయి.
అరకు లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 నియోజకవర్గాలను విభజించి... 2 జిల్లాలు ఏర్పాటు చెయ్యాలని కమిటీ ప్రతిపాదించింది. అరకు-1 జిల్లాలోకి పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలనూ... అలాగే అరకు-2 జిల్లాకు అరకులోయ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలను తేవాలని కమిటీ ప్రతిపాదించింది. అరకు - 1 జిల్లాకు పార్వతీపురం, అరకు-2 జిల్లాకు పాడేరు,... హిందూపురం జిల్లాకు హిందూపురం లేదా పెనుకొండను జిల్లా కేంద్రాలుగా నియమించాలని కమిటీ ప్రతిపాదించింది.
రద్దు అయ్యే రెవెన్యూ డివిజన్లు:
- పశ్చిమ గోదావరి జిల్లా కుకునూరు డివిజన్ పరిధిలోని పోలవరం నియోజకవర్గ మండలాల్ని... కొత్తగా ఏర్పాటయ్యే జంగారెడ్డి గూడెం డివిజన్లోకి చేర్చడం.
- తూర్పుగోదావరి జిల్లా ఎటపాక డివిజన్ పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గ మండలాలను కొత్తగా ఏర్పాటయ్యే రంపచోడవరం డివిజన్లోకి చేర్చడం.
- నెల్లూరు జిల్లా... ఆత్మకూరు నియోజకవర్గ మండలాలను నెల్లూరు డివిజన్లోకి... ఆత్మకూరు డివిజన్ పరిధిలోని ఉదయగిరి నియోజకవర్గ మండలాలను కందుకూరు డివిజన్లోకి మార్చడం.
ఇది కూడా చదవండి: Gold Prices Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు... నేటి రేట్లు ఇవీ
ఈ ప్రతిపాదనా రిపోర్టు ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనిపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ హడావుడిలో ప్రభుత్వం ఉంది. అలాగే స్థానిక ఎన్నికల అంశం కూడా ఉంది. ఇవన్నీ కొలిక్కి వచ్చాక అప్పుడు ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై ముందుకు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.