New CS Sameer Sharma: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ (Sameer Sharma)నియమితులయ్యారు. ఈనెల 30వ తేదీతో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ (Adithyanath Das)పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే మూడు నెలల ఎక్స్ టెన్షన్లో ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు. ప్రస్తుత సీఎస్ 1987 బ్యాచ్ కు చెందిన ఆదిత్యనాథ్ దాస్ కంటే సమీర్ శర్మ రెండేళ్ల సీనియర్.. 1985 బ్యాచ్‌కు చెందిన సమీర్ శర్మ కొనేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అంత పెద్ద పోస్టులో ఉండి.. అకస్మాత్తుగా రాష్ట్ర కేడర్‌కు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే సమీర్ శర్మ సైతం మరో రెండు నెలల్లో అంటే నవంబరు నెలాఖరులో పదవీ విరమణ చేయాల్సి ఉంది. అంటే ఆయన సర్వీస్ ప్రకారం కేవలం రెండు నెలలు మాత్రమే ఈ కొత్త పదవిలో ఉండాలి.. అంతే ఈ మాత్రం దానికే అంత పెద్ద పోస్టు ఎందుకు వదులుకుని వస్తున్నారో సీనియర్ అధికారులకు అర్థం కావడం లేదు. అయితే గతంలో నీలం సాహ్ని, ఆధిత్యనాథ్ దాస్ లకు పదవిని ఎలా పొడిగింపు కోరారో.. అలాగే సమీర్ శర్మకు కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి కొనసాగింపు ఇప్పించే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలాన్ని పొడిగిస్తూ వస్తోంది. జూన్ 30వ తేదీతో ఆయన పదవీ కాలం ముగిసింది. దీంతో మరో మూడు నెలలపాటు పొడిగించింది. దీంతో సెప్టెంబరు 30, 2021 వరకు అంటే.. ఈ నెలాఖరి వరకు ఆయన పదవీ కాలం ఉంది. అయితే మరోసారి పొడిగించుకునే అవకాశం ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్త సీఎస్ కు ఓటేసింది..
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన పలు శాఖల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. అంతకుముందు సీఎం నీలం సాహ్ని పదవి కాలం కూడా అలాగే పొడిగించారు. గతేడాది జూన్ 30న ఆమె రిటైర్ కావాల్సి ఉండగా.. జగన్ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆమె పదవీకాలాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. తరువాత ఇక పొడిగించే అవకాశం లేకపోవడంతో ఆమెకు కీలకమైన ఎస్ఈసీ బాధ్యతలు అప్పగించారు తారువాత ఆమె స్థానంలో చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు.
ఇదీ చదవండి: ఆమె వయసు 25 ఏళ్ల లోపే.. అత్యవసరం అంటూ ఓ బైక్ ఆపి లిఫ్ట్ అడిగింది.. ఆ పై ఊహించని ట్విస్ట్
ఇక ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపలేదో.. ఆయన వద్దనుకున్నారో కారణం ఏదైనా.. ఇప్పుడు సమీర్ శర్మ వస్తున్నారు. అయితే ఆయన సైతం మరో రెండు నెలల్లో అంటే నవంబరు నెలాఖరులో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ మాత్రం దానికే అంత పెద్ద పోస్టు ఎందుకు వదులుకుని వస్తున్నారో సీనియర్ అధికారులకు అర్థం కావడం లేదు. అయితే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి కొనసాగింపు ఇప్పించే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics