• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANDHRA PRADESH MYSTERY DISEASE AFFLICTING THE TRIBALS IN VIZIANAGARA DISTRICT OF ANDHRA PRADESH PRN

Andhra Pradesh: ఏపీలో మరో వింత వ్యాధి కలకలం.., భయంతో వణికిపోతున్న జనం

Andhra Pradesh: ఏపీలో మరో వింత వ్యాధి కలకలం.., భయంతో వణికిపోతున్న జనం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో వింత వ్యాధి(Mystery Disease) కలకలం రేపుతోంది. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకున్న వింత వ్యాధిని (Eluru Mystery Disease) మరువక ముందే మరో జిల్లాలో అంతుచిక్కని జబ్బు ప్రాణాలు తీస్తోంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో మరో వింత వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకున్న వింత వ్యాధిని మరువక ముందే మరో జిల్లాలో అంతుచిక్కని జబ్బు ప్రాణాలను బలిగొంటోంది. ఎందుకు ఎలా వస్తుందో తెలియని వ్యాధితో జనం భయాందోళనలకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లి విజయనగరం జిల్లా ఏజెన్సీలో గిరిజనులను అంతుచిక్కని వ్యాధి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటీవల జిల్లాలోని పాచిపెంట మండలం చిల్లమామిడి గ్రామంలో ఏడుగురు గిరిజనులు మృతి చెందిన ఘటన కలకలం రేపిం. ఆ ఘటన మరువకముందే అదే మండలంలోని కంకణాపల్లిలోనూ అంతుచిక్కని వ్యాధితో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ గ్రామంలోనూ 6 నెలల వ్యవధిలో 50ఏళ్లలోపు వారు 10 మంది మృతి చెందారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    రెండు రోజుల క్రితం కంకణాపల్లికి చెందిన గెమ్మెల రామకృష్ణ అనే యువకుడు మృతి చెందిన విషయం వింత లక్షణాలో మృతి చెందడం, ఆ విషయంలో ఇతర గ్రామంలోని వ్యక్తికి తెలియడంతో విషయం బయటకు వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం ఒడిశా సరిహద్దు కర్రివలస పంచాయతీ కంకణాపల్లిలో 70 గిరిజన కుటుంబాలున్నాయి. మొత్తం 300 మంది వరకు నివసిస్తున్నారు. వీరిలో గతేడాది సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు 9మంది మృతి చెందారు. తొలుత జ్వరం రావడం, కొన్ని రోజుల తర్వాత శరీరమంతా ఉబ్బి రక్తహీనతతో నడవలేక మంచాన పడుతున్నారు. ఆ తర్వాత కళ్లు పచ్చగా మారి లేవలేని స్థితిలో మంచం పడుతున్నారు. నెలరోజుల్లోపే ప్రాణాలు కోల్పోతున్నారు.

    డాక్టర్లు ఏన్నారంటే..!
    ఈ అంతుచిక్కని వ్యాధిపై డాక్టర్లు కూడా స్పందించారు. దీనిపై పూర్తి విచారణ చేపడతామని పాచిపెంట PHC డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం గ్రామాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని.. బాధితులకు మందులు అందిస్తున్నట్లు తెలిపారు. ఐతే గిరిజనులకు సోకుతున్న వ్యాధికి అసలు కారణమేంటనేది తేలడం లేదని చెప్పారు. జ్వరం, శరీరం ఉబ్బిపోవడం, కళ్లు పచ్చగా మారడమనే లక్షణాలు అంతు చిక్కని విధంగా ఉన్నాయంటున్నారు. ఐతే కొన్నిసార్లు కామెర్ల వ్యాధి ముదిరితే ఇలాంటి లక్షణాలుండే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.

    ఆహారపు అలవాట్లే కారణమా..?
    గిరిజనలు ఆహారపు అలవాట్లు సాధారణ ప్రజలకంటే భిన్నంగా ఉంటాయి. వారు ఎక్కువగా తాజా ఆహారాన్ని తీసుకోరు. ఆహారాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేసుకొని తింటుంటారు. ముఖ్యంగా మాంసాహారాన్ని దాదాపు వారం రోజుల వరకు నిల్వ ఉంచుకుంటారు. ఏదైనా జంతువు చనిపోతే రెండు మూడు రోజుల తర్వాత కూడా పచ్చిమాంసాన్ని అలాగే ఉంచి తింటుంటారు. అలాగే జావలు, ఇతర ద్రవాలను పులియబెట్టుకొని తీసుకుంటుంటారు. ఇక పరిసరాల్లో పరిశుభ్రత పాటించకపోవడం కూడా అంటు వ్యాధుల ప్రభావం ఎక్కువవుతోంది. కొండప్రాంతాల్లో పరిశుభ్రమైన నీరు దొరక్కపోవడం, పౌష్టికాహారంపై అవగాహన లేకపోవడం కూడా ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తికి కారణమవుతోంది. గిరిజనులకు పాలుతాగే అలవాటు లేకపోవడం కూడా ఈ పరిస్థితికి మరో కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎనీమియా, సికిల్ సెల్ ఎనీమియా వంటి వ్యాధులు గిరిజనుల ప్రాణాలను హరించేస్తున్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు