Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH MUNICIPAL WORKERS CALLED OFF STRIKE BUT THEY PUT DEADLINE TO GOVERNMENT NGS

Called off Strike: మున్సిపల్ సమ్మె తాత్కాలిక వాయిదా? సోమవారం వరకు డెడ్ లైన్

మున్సిపల్ సమ్మె తాత్కాలిక వాయిదా

మున్సిపల్ సమ్మె తాత్కాలిక వాయిదా

Called off Strike: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సమ్మె కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రభుత్వం ఇచ్చిన హామీతో కార్మికులు కాస్త శాంతించారు.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు సోమవారం లోపు నెరవేర్చకపోతే.. తిరిగి సమ్మెకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
    Called off Strike: నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె(Municipal Strike) తో చాలా ప్రాంతాలు చెత్తకుప్పలుగా కనిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగరాల్లో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయింది. కార్మికులు విధుల్లోకి రాకపోవడంతో రోడ్లన్నీ చెత్తతో నిండిపోయాయి. పారిశుద్ద్య కార్మికుల నిరవధిక సమ్మెతో విశాఖ (Visakha) , విజయవాడ (Vijayawada), తిరుపతి (Tirupati) లాంటి నగరాల్లో భారీగా చెత్త చెదారంతో పరిస్థితితి దారునంగా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. వివిధ ప్రాంతాల్లో ఎక్కడి చెత్త అక్కడే నిలవడం దినికి తోడు పశువులు, కుక్కలు, ఆ చెత్తను చిందర వందరం చేయడంతో పాదచారులతో పాటు వాహనదారులు రోడ్డుపై వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి మరీ దారుణంగా మారడంతో ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది. మున్సిపల్ కార్మికుల జీతాల పెంపునకు పచ్చజెండా ఊపారు  సీఎం  జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) . దీంతో 18 వేల నుంచి 21 వేల రూపాయలకు పెరిగేలా చేసింది ప్రభుత్వం. అలాగే ఆక్యుపేషన్ అలవెన్స్ పై త్వరలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఆక్యుపేషన్ అలవెన్స్ పై చర్చ జరిగిందని, జీతాలు పెరిగిన తర్వాత కూడా ఆక్యుపేషన్ అలవెన్స్ పెంచాలని మున్సిపల్ కార్మికులు కోరారు. ఆక్యుపేషన్ అలవెన్స్ 6 వేలు యథాతధంగా ఉంచడానికి సీఎం అంగీకరించారని చెప్పారు.

    తాజాగా ఆంధ్ర్రదేశ్ లో 9 కీలక డిమాండ్లతో సమ్మె ప్రారంభించిన 35 వేల మంది కార్మికులు ఇవాళ మెట్టు దిగారు. ప్రభుత్వం నిన్న వారికి వేతనాలు పెంచుతున్నట్లు చేసిన ప్రకటన నేపథ్యంలో ఇావాళ ఉదయం వారు తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోతే మాత్రం తిరిగి సమ్మెకు దిగుతామని ప్రకటించారు.



    రెండు రోజుల క్రితం ఏపీలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్యం క్షీణించింది. ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది. మరోవైపు వర్షాలు కూడా కురుస్తుండటంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఏర్పడింది. దీంతో స్పందించిన ప్రభుత్వం నిన్న మున్సిపల్ కార్మికుల వేతనాల్ని 18 వేల నుంచి 21 వేలకుపెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే వారికి ఇస్తున్న అలవెన్స్ కూడా యథాతథంగా కొనసాగిస్తామని మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

    ఇదీ చదవండి : పాములంటే భయమా.. ఈ వీడియో చూస్తే..! మీ భయం పటాపంచలవుతుంది

    ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఇవాళ చర్చించిన మున్సిపల్ జేఏసీ నేతలు తమ సమ్మెను తాత్కాలికంగా విరమించాలని నిర్ణయించారు. అయితే సోమవారంలోగా తమకు ఇచ్చిన హామీల అమలుపై రాతపూర్వకంగా అగ్రిమెంట్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇందులో విఫలమైతే మాత్రం సోమవారం నుంచి తిరిగి సమ్మెలోకి వెళ్తామని మున్సిపల్ కార్మికుల జేఏసీ నేతలు ప్రకటించారు. దీంతో ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంటోంది. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పారిశుద్ధ్య పరిస్ధితులు ఇప్పటికే క్షీణిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, AP News

    తదుపరి వార్తలు