హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

School Teache: బాబోయ్ ఇదేం బుద్ధి.. భార్య స్థానంలో వచ్చిన భర్త.. విషయం తెలిసి షాక్ తిన్న అధికారులు

School Teache: బాబోయ్ ఇదేం బుద్ధి.. భార్య స్థానంలో వచ్చిన భర్త.. విషయం తెలిసి షాక్ తిన్న అధికారులు

ప్రభుత్వం స్కూల్ టీచర్ 20 కాలేజీలకు యజమాని

ప్రభుత్వం స్కూల్ టీచర్ 20 కాలేజీలకు యజమాని

Municipal School Teacher: ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆడిందే ఆట పాడిందే పాట సాగుతో్ంది కొన్ని చోట్ల.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్కూళ్ల విషయంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో.. ఉపాద్యాయుల ఇష్టారాజ్యంగా మారింది. తాజాగా ఓ టీచర్ చేసిన పని అందరూ షాక్ తినేలా చేసింది.

ఇంకా చదవండి ...

Municipal School Teacher Suspended: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రభుత్వ పాఠశాలల (Government Schools) రూపు రేఖలు మార్చాలని ఏపీ ప్రభుత్వం (AP Government) భావిస్తోంది. ఇప్పటికే నాడు నేడు పేరుతో పలు స్కూళ్లకు భారీగా నిధుల విడుదలు చేశారు.. కొత్త కొత్త హంగులతో బిల్డింగులను తీర్చి దిద్దారు.. అలాగే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇలా ప్రభుత్వం ఓ వైపు సంస్కరణలు అంటూ కొత్త కొత్త నిబంధనలు పెడుతోంది. విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే అమ్మ ఒడి (Amma Vodi) వస్తుందని కండిషన్ పెట్టింది. అలాగే స్కూళ్ల సంబంధించి అన్ని ఫైళ్లను ఆన్ లైన్ చేస్తోంది. ఇదంతా ఒకవైపు అయితే.. గ్రామీణ పాఠశాలల పరిస్థితి మరోరకంగా ఉంది. కొన్ని గ్రామాల్లో ఒకరిద్దరూ టీచర్లు ఉండడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాట అవుతోంది. ప్రశ్నించే వారు లేకపోవడంతో అసలు వారు స్కూళ్లకు వెళ్తున్నారా.. వారి స్థానంలో వేరే ఎవరైనా మేనేజ్ చేస్తున్నారా అన్నది కూడా తెలియడంలేదు. తాజాగా అనంతపురం జిల్లా (Anantapuram District)లోని ఓ స్కూళ్లో జరిగిన ఘటన.. అధికారుల పర్యవేక్షణా లోపాన్ని ప్రశ్నించేలా చేస్తోంది.

ఓ మహిళా టీచర్.. స్కూల్ కు వెళ్లడం లేదు. అంటే ఆమెకు చెప్పడం రాదో.. చెప్పి కష్టపడడం ఎందుకు.. ఇంట్లో పనులు చేయాలి అనుకున్నారో ఏమో.. కారణం ఏదైనా.. ఆమె స్థానంలో భర్త స్కూలుకు హాజరయ్యారు. తనూ ఓ పాఠశాలలో టీచర్‌ అయినప్పటికీ అక్కడ విధులకు డుమ్మా కొట్టి.. భార్య ‘విధుల’ను నిర్వర్తించారు. ఈ విషయం ఎంఈఓ తనిఖీల్లో బయటపడింది. విషయం తెలిసిన వెంటనే ఆమెను సస్పెండ్‌ చేయడంతో పాటు అయ్యవారిపైనా చర్యలకు సిఫారసు చేశారు.

ఇదీ చదవండి: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కొలిక్కొచ్చిన పీఆర్సీ.. సీఎం ప్రకటన కోసం వెయిటింగ్

అనంతపురం జల్లా కదిరి పట్టణంలోని రాణీనగర్‌ మునిసిపల్‌ పాఠశాలలో రమేష్‌ తెలుగు ఉపాధ్యాయుడి గా పనిచేస్తున్నారు. ఆయన భార్య ఆర్‌. అరుణాదేవి ఓడీచెరువు మండలం టి.కుంట్లపల్లి హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌. అరుణాదేవి ఈ నెల 7 నుంచి 9 వరకు సెలవుపై వెళ్లారు. పదో తేదీ విధులకు హాజరుకావాల్సి ఉండేది.

ఇదీ చదవండి: బొప్పాయి పండులో ఆకట్టుకుంటున్న బుల్లి గణపతి.. మండపం పెట్టి పూజిస్తున్న భక్తులు

ఆమె వస్తారనే ఉద్దేశంతో ఆరోజు హెచ్‌ఎం సునీత సెలవు పెట్టారు. కానీ అరుణాదేవి స్థానంలో భర్త రమేష్‌ విధులకు హాజరయ్యారు. ఈ విషయం ఎంఈఓ చెన్నక్రిష్ణ ఆకస్మిక తనిఖీలో బయటపడింది. ఆయన డీఈఓకు నివేదిక పంపడంతో అరుణాదేవిని సస్పెండ్‌ చేస్తూ ఆదివారం ఉత్తర్వులిచ్చారు. ఆమె భర్తపైనా చర్యలు తీసుకోవాలని కదిరి మునిసిపల్‌ కార్యాలయానికి సిఫారసు చేశారు.

ఇదీ చదవండి: ఇకపై తల్లుల అకౌంట్ లో ఆ నగదు పడదు.. సర్కార్ కు మరో ఎదురుదెబ్బ

అంతేకాదు ఓడీచెరువు మండలం గోళ్లవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ జి.గణేష్‌ ఏకోపాధ్యాయుడిగా ఉన్నారు. ఎలాంటి అనుమతి లేకుండానే గురు, శుక్రవారం పాఠశాలకు డుమ్మా కొట్టారు. దీంతో విద్యార్థులందరూ ఇళ్ల వద్దే ఉండిపోయారు. ఈ విషయంపై గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఎంఈఓ పాఠశాలను తనిఖీ చేయగా .. నిజమేనని తేలింది. దీంతో ఎంఈఓ సిఫారసు మేరకు ఎస్జీటీ గణేష్‌ను సస్పెండ్‌ చేస్తూ డీఈఓ ఉత్తర్వులిచ్చారు. హిందూపురం మండలం కొట్నూరు ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం కె.నర్సిరెడ్డిని కూడా డీఈఓ సస్పెండ్‌ చేశారు. ఆయన విద్యార్థులకు పాఠాలు సక్రమంగా చెప్పడం లేదని ఎంఈఓ గంగప్ప ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Schools

ఉత్తమ కథలు