హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: సినిమా టికెట్ల వివాదంలో ట్విస్ట్.. వర్మకు మంత్రి పేర్ని నాని అపాయింట్‌మెంట్

Breaking News: సినిమా టికెట్ల వివాదంలో ట్విస్ట్.. వర్మకు మంత్రి పేర్ని నాని అపాయింట్‌మెంట్

మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ

మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ

Varma vs Minster Nani: ఆంధ్రప్రదేశ్ లోని సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశంలో కీలక పరిణమాం చోటు చేసుకుంది. సోషల్ మీడియా వేదికపై ఒకరికి ఒకరు కౌంటర్లు వేసుకున్న కాసేపటికి.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మంత్రి పేర్ని నాని అపాయింట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.

ఇంకా చదవండి ...

Ram Gopal Varma vs Minster Perni Nani: ఆంధ్రప్రదేశ్ లో  టికెట్ల ధరలను ప్రభుత్వం తగ్గించడంతో వివాదం ముదిరి పాకనపడింది. ఇటు ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్టుగా పరిస్థితి మారింది.  ఏపీ ప్రభుత్వం తీరుపై సినిమా పెద్దలంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను సీఎం జగన్ కు చెప్పాలని చిరంజీవితో సహా సినిమా పెద్దలు ప్రయత్నిస్తున్నా.. అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో వివాదం తారా స్థాయికి చేరింది. ఇదే సమయంలో వివాదాిస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మంత్రి పేర్ని నాని మధ్య గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా యుద్ధం కొనసాగుతోంది. మంగళవారం రాం గోపాల్ వర్మ.. వరుసగా ఏపీ మంత్రిపై ట్వీట్లతో ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆయన ప్రశ్నలు అన్నింటికీ.. దేనికి దానికి అన్నట్టు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.. ఆ వ్యవహారం అక్కడితో ముగియలేదు.. దానికి కూడా వర్మ రివర్స్ కౌంటర్ ఇచ్చారు.. దీంతో ఇద్దరి మధ్య యుద్ధం తారా స్థాయికి చేరిన సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది..

సినిమా సమస్యలు.. టికెట్ల ధరకు సంబంధించి అంశాలపై ప్రభుత్వానికి వివరిస్తాను అంటూ రాం గోపాల్ వర్మ..  మంత్రి పేర్ని నానిని కోరారు.. ఆయన అడిగిన వెంటనే ఆలస్యం చేయకుండా.. కలిసేందుకు వర్మకు మంత్రి పేర్ని నాని అపాయింట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయల్లో ఆసక్తికర పరిణామంగా మారింది..

ప్రభుత్వం తో గొడవ పెట్టుకోవాలి అన్నది తమ ఉద్దేశం కాదు అన్నారు వర్మ.. పర్సనల్ గా వై.ఎస్.జగన్ అంటే తనకు చాలా అభిమానం అని.. కేవలం మా సమస్యలు మేము సరిగా చెప్పుకోలేక పోవడం వల్లో లేక , మీరు మా కోణం నుంచి అర్థం చేసుకోకపోవడం వల్లో ఈ మిస్ అండర్ స్టాండింగ్ ఏర్పడింది అంటూ మరో ట్వీట్ చేశారు..


ఈ ట్వీట్ కు కూడా మంత్రి పేర్ని నాని వెంటనే స్పందించారు.. ప్రభుత్వం, సీఎం జగన్ పై ఉన్న అభిమానానికి ధన్యవాదాలు చెబుతూ.. తప్పకుండా త్వరలో కలుద్దాం అంటూ అపాయింట్ మెంట్ ఇచ్చారు..


మంత్రి తనకు అపాయింట్ మెంట్  ఇవ్వడంతో వర్మ కూడా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.. సినిమా ఇండస్ట్రీకి ఉన్న సమస్యలు.. టికెట్ల వ్యవహారం అన్ని కలిసి వివరిస్తాను అని మరో ట్వీట్ చేశారు వర్మ..


తాజా ట్వీట్లతో మంత్రికి- వర్మకు మధ్య ట్వీట్ల యుద్ధం ముగిసినట్టే అని భావిస్తున్నారు. అయితే ఏదో మాట వరకు కలుద్దామన్నారా.. లేక నిజంగానే వర్మను మంత్రి త్వరలో కలుస్తారా లేదా ఎప్పటిలాగే కాలయాపన చేస్తారో చూడాలి..  కానీ కలుద్దామని తరువాత కలిసే టైం ఇవ్వకపోతే.. వివాదాలకు కేరాఫ్ అయిన వర్మ వదిలి పెట్టకపోవచ్చు..

First published:

Tags: Andhra Pradesh, Ap minister perni nani, AP News, Ram Gopal Varma

ఉత్తమ కథలు