ANDHRA PRADESH MINSTER KODALI NANI SLAMS ON TELUGU DESAM PARTY AND NTR DISTRICT NGS
Kodali Nani: టీడీపీ చీర్ బాయ్స్ అమెరికా అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తారా..? ఆ ఇద్దరికీ భారత రత్న ఇవ్వాలన్న మంత్రి
కొడాలి నాని (ఫైల్)
Kodali Nani on TDP: మంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీపై విరుచుకుపడ్డారు.. క్యాసినో వ్యవహారంపై బైడెన్ కు ఫిర్యాదు చేస్తారా అంటూ టీడీపీ నేతలపై సెటైర్లు వేశారు.. అలాగే ఎన్టీఆర్ జిల్లాపై ప్రతిపక్ష చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అంతకాలం ఏం చేశారని ప్రశ్నించారు.
Minster Kodali Nani on TDP: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో కొత్త జిల్లాల ఏర్పాటు (New District) వివాదాస్పదమవుతున్నాయి. కొన్ని జిల్లాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడలో కొత్తగా ఏర్పడిన విజయవాడ (Vijayawada) జిల్లాకు ఎన్టీఆర్ పేరును ప్రకటించిన నిర్ణయాన్ని అంతా స్వాగతిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ (TDP) ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తునే ఏపీ ప్రభుత్వం (AP Government) పై విమర్శలు చేస్తోంది. కాస్త ఆలస్యంగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. జిల్లాలకు ఎన్టీఆర్ పేరు పెడితే ఎందుకు వ్యతిరేకిస్తామని ప్రశ్నించారు. వైసీపీ ఈ విషయంలో కేవలం నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే ఆయన పేరుతో ఉన్న అన్నా క్యాంటీన్లను ఎందుకు ఎత్తేశారని ప్రశ్నించారు.. ఇతర టీడీపీ నేతలు సైతం కేవలం కమ్మ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయనే అభిప్రాయంతోనే ఆయన పేరు పెట్టారని విమర్శిస్తున్నారు అయితే ఈ విమర్శలపై మంత్రి కొడాలి నాని (Minster Kodali Nani) తనదైన స్టైల్లో స్పందించారు. తమ జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. గుడివాడ (Gudivada) లో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన మంత్రి కొడాలి నాని.. ఎన్టీఆర్ వారసులం అని చెప్పుకునే సిగ్గుమాలిన వ్యక్తులు చేయలేని పని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) చేసి చూపించారని అన్నారు నాని.
చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లు అధికారంలో ఉండి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కనీసం ప్రపోజల్ కూడా పెట్టలేదు ఎందుకని కోడాలి నాని ప్రశ్నించారు. ఇక విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని రాద్దాంతం చేస్తూ, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సిద్ధాంతపరంగా వైఎస్ఆర్, ఎన్టీఆర్ విభిన్న ధృవాలైనా.. ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తించేలా ఓ జిల్లాకు పేరు పెట్టారని చెప్పారు కోడాలి నాని. ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరికీ భారతరత్న ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ పేరును ఓ జిల్లాకు పెట్టడాన్ని అభినందించాల్సిన తెలుగుదేశం రాజకీయం చేయడం దుర్మార్గమని అన్నారు. ఎన్టీఆర్‌ని ఆరాధించే వ్యక్తిగా, ఎన్టీఆర్ అభిమానుల తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు కొడాలి నాని.
ఇక గుడివాడ క్యాసినో అంశంపై టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి అల్లరి చేస్తుందని నాని ఎద్దేవా చేశారు. గుడివాడలో తనను ఓడించలేక క్యాసినో నిర్వహించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మూడు రోజులు గుడివాడలో నిర్వహించిన క్యాసినోకు ఐదొందల కోట్లు వస్తే, 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలని ప్రశ్నించారు. గుడివాడ ప్రజలు అమాయకులు కాదని, వారికి అన్ని విషయాలు తెలుసునని అన్నారు. స్థానిక టీడీపీ నేతలు కూడా పట్టించుకోని విషయాన్ని, టీడీపీ చీర్ బాయ్స్ పోలీసులకు ఫిర్యాదులు చెయ్యడం అవివేకమని అన్నారు.
గుడివాడలో క్యాసినో వ్యవహారంపై ఇప్పటికే అందరికీ ఫిర్యాదు చేశారని.. ఇలాగా వదిలస్తే త్వరలో బైడెన్‌కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తారేమో? అంటూ సటైర్ వేశారు. గుడివాడలో మూడు రోజులు క్యాసినో జరిగితే, 362రోజులు టీడీపీ చీర్ బాయ్స్ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలకు జీవితకాలం టైమ్ ఇచ్చాను వారికి చేతనైంది చేసుకోవచ్చు అని అన్నారు మంత్రి కొడాలి నాని.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.