హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minster Dance: కూతురితో కలిసి మంత్రి అదిరే స్టెప్పులు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Minster Dance: కూతురితో కలిసి మంత్రి అదిరే స్టెప్పులు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ (ఫైల్)

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ (ఫైల్)

Adimulapu Suresh Dance Video: ఆయన విద్యాశాఖ మంత్రి ఎప్పుడూ రివ్యూలు, మీటింగ్ లు, సభలు.. పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉంటారు.. అలాంటి ఆయన స్టైల్ మార్చారు సూపర్ స్టెప్పులతో ఇరగదీశారు.. అది కూడా కూతురితో కలిసి హంగామా చేశారు.. ఎందుకో ఎక్కడో తెలుసా..?

ఇంకా చదవండి ...

Adimulapu Suresh Dance Video: ఆంధ్రప్రదేశ్ (Andhra Prasedh) విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh).. ఆయన్ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు.. అందులోనూ విద్యాశాఖకు మంత్రి ప్రజల్లో పెద్దగా కనిపించే అవsకాశం లేదు.. అధికారులతో రివ్యూలు, సమీక్షలు, ఫలితాల వెల్లడి.. అప్పుడప్పుడు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు.. పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీ ఉంటారు.. ఎప్పుడు కాస్త సీరియస్ గానే ఉన్నట్టు కనిపిస్తారు.. అలాంటి ఆయన సరదా స్టైల్ మార్చారు.. అది కూడా ఎవరూ ఊహించని విధంగా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటూ ఇరగదీశారు.. స్టెప్పులంటే ఎదో కాలు చేయి కదపడం కాదు.. నిజంగానే మంచి డ్యాన్సర్ (Dancer) అన్న రేంజలో స్టేజ్ పై అలరించారు. అది కూడా ఆయన సింగిల్ గా కాదు.. తన కూతురుతో కలిసి మంచి స్టెప్పులు వేశారు విద్యాశాఖ మంత్రి.. ఇంతకీ ఎందుకు ఆయన డ్యాన్స్ ఎందుకు వేశారు.. ఎక్కడో తెలుసా..?

మంత్రి సురేష్ తన కూతురు పెళ్లిలో డ్యాన్స్‌తో హమ్ చేశారు. ఆయన డ్యాన్స్ చూసినవారంతా ఫిదా అవుతూ అభినందించారు.మంత్రి సురేష్ కుమార్తె శ్రిష్టి వివాహం హైదరాబాద్‌ (Hyderabad)లోని గోల్కొండ రిసార్ట్స్‌లో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో సై సినిమాలో పాటకు మంత్రి సురేష్ కూతురు శ్రిష్టితో కలిసి స్టెప్పులేశారు. దీంతో స్టేజ్ కింద ఉన్న ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు అందా ఈలలు వేస్తూ ప్రోత్సహించడంతో ఇంకాస్త హుసారుగా స్టెప్పులు వేశారు. కుమార్తెకు డ్యాన్స్ లో పోటీ ఇచ్చేలా అదరగొట్టారు. ప్రస్తుతం మంత్రి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. డ్యాన్సింగ్ టాలెంట్‌‌తో మంత్రి అదరగొట్టారని కితాబిస్తున్నారు.

ఈ వివాహ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సతీమణి వైఎస్ భారతి రెడ్డి (YS Barath Reddy), కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.

ఇదీ చదవండి : ఇన్నాళ్లూ మాస్క్ లు వేసుకున్నారు.. ఇప్పుడు ఎవరు ఏంటో తెలిసిపోయిందంటూ రోజా ఫైర్

మంత్రిగా, రాజకీయ నేతగా రోజువారీ కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆదిమూలపు సురేష్ ఇలా కుమార్తె పెళ్లి వేడుకలో సరదాగా చిందులేస్తూ ఎంజాయ్ చేశారు. కాగా.. మంత్రి సురేష్ డ్యాన్స్ బావుందంటూ వైసీపీ (ycp) అభిమానులు, కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, Ap government, Ap minister suresh, AP News, Marriage

ఉత్తమ కథలు