Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH MINISTER MEKAPATI GOWTHAM REDDY HELPED ROAD ACCIDENT VICTIM IN GUNTUR DISTRICT PRN

Andhra Pradesh: మానవత్వం చాటుకున్న మంత్రి గౌతమ్ రెడ్డి...

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Minister Mekapati Gowtham Reddy) తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు.

    కొంతమంది ప్రజాప్రతినిథులు పాలనలోనే కాదు.. సహాయంతోనూ వార్తల్లో నిలుస్తుంటారు. నడిరోడ్డుపై కష్టాల్లో ఉన్నవారి ఆదుకుంటూ శభాష్ అనిపించుకుంటుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదాన్ని గమనించి స్వయంగా తానే సహాయక చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి వైఎఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యేందుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి తాడేపల్లికి వస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట వద్ద బైక్ పై వస్తున్న వ్యక్తి లారీని తప్పించబోయి అదుపుతప్పి డివైడర్లు ఢీ కొట్టాడు. ప్రమాదాన్ని గుర్తించిన మంత్రి గౌతమ్ రెడ్డి.. వెంటనే తన కాన్వాయ్ నిలిపి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

    రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశంలో దగ్గరుండి మంత్రి మేకపాటి సహాయక చర్యలు పర్యవేక్షించారు. స్థానిక ఎమ్మెల్యే విడతల రజిని, చిలకలూరిపేట ఎస్సైకు స్వయంగా ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. గాయపడ్డ వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను  మంత్రి ఆదేశించారు. గాయపడ్డ వ్యక్తి ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందినవారుగా తెలుస్తోంది.

    Andhra Pradesh minister Mekapati Gowtham Reddy, Minister mekapati Gowtham Reddy, Mekapati Gowtham reddy, Andhra Pradesh, Ap News, Nellore District, Nellore, Guntur District, Vidadala Rajini, YS Jaganmohanreddy, Tadepalli, Telugu news, ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్, ఏపీ న్యూస్, నెల్లూరు జిల్లా, నెల్లూరు, గుంటూరు జిల్లా, విడదల రజిని, వైఎస్ జగనమోహన్ రెడ్డి, తాడేపల్లి, తెలుగు న్యూస్,
    సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి గౌతమ్ రెడ్డి


    సకాలంలో స్పందించి క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించడంతో మంత్రి చూపిన చొరవను స్థానికులు అభినందించారు. ప్రస్తుతం బాధితుడికి చిలకలూరిపేట ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్నట్లు తెలుస్తోంది.

    ఇది చదవండి: రేణిగుంట ఎయిర్ పోర్టులో టెన్షన్ టెన్షన్... చంద్రబాబుకు నో పర్మిషన్...


    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Mekapati Goutam Reddy, Mekapati Goutham Reddy, Telugu news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు