Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH MINISTER ADIMULAPU SURESH MADE KEY ANNOUNCEMENT ON SSC AND INTER EXAMS CANCELLATION FULL DETAILS HERE PRN

Tenth, Inter Exams: టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ రద్దుపై కీలక ప్రకటన.. సరైన నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు ( Tenth, Inter Exams Cancellation) చేయాలన్న డిమాండ్లపై ప్రభుత్వం స్పందించింది.

    ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్ష నిర్వహణపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం పట్టుబడుతోంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ టెన్త్, ఇంటర్ పరీక్షలపై కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించి వారిని పై తరగతులకు ప్రమోట్ చేశామని.. అలాగే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలపై సరైనా నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతానికి పరీక్షలను వాయిదా వేయడం గానీ, రద్దు చేసే ఉద్దేశంగానీ లేదన్నారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే యూనివర్సిటీలలో కూడా తరగతులు, పరీక్షల నిర్వహణపై అన్ని కోణాల్లో సమీక్షించి, మరోసారి సమావేశం అవుతామన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని తీర్మానించినట్లు తెలిపారు.

    కొవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఆత్మస్థైర్యం ఇవ్వాలని, అలగే విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటుంటే.. సీఎం జగన్‌పై లోకేష్‌ అవాకులు, చెవాకులు పేలుతున్నాని మంత్రి సురేష్ మండిపడ్డారు. లోకేష్‌ వాడిన పదజాలం, ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లోకేష్‌ నిజంగా ఉన్నత చదువులు చదివి ఉంటే, ఆ డిగ్రీలు నిజమే అయితే, చదువు విలువ తెలిసిన వాడైతే సీఎం నిర్ణయాన్ని తప్పు పట్టడని వ్యాఖ్యానించారు. గత ఏడాది మాదిరిగా విద్యార్థులు నష్టపోకుండా ఉంటేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంటే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. లోకేష్‌ ఒక అజ్ఞాని అని రుజువు చేసుకున్నాడు. అందరూ ఆయనను వెర్రినాయుడు అంటున్నారని మంత్రి సురేష్ ఎద్దేవా చేశారు.

    ఇది చదవండి: ఏపీలో విద్యాసంస్థలు బంద్...టెన్త్, ఇంటర్ స్టూడెంట్స్ కు సెలవులే..


    పరీక్షలు నిర్వహిస్తే దాదాపు 70 లక్షల మంది విద్యార్థులకు కరోనా సోకుతుందని లోకేష్ బురద జల్లుతున్నారని.. కరోనా వస్తుందని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి సురేష్ మండిపడ్డారు. వకీల్‌సాబ్‌ సినిమాను నాలుగు కాదు, ఆరు షోలు వేయాలని చంద్రబాబు అన్నారని.. దాన్ని రాజకీయం చేసి తిరుపతి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసినప్పుడు, లోకేష్‌ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించిన మంత్రి.. అప్పుడు నీకు కరోనా ముప్పు కనిపించలేదా? అని నిలదీశారు. విపత్కర పరిస్థితులలో ఏ విధంగా విద్యా సంవత్సరాన్ని ముందుకు తీసుకుపోవాలన్న దానిపై సూచనలు, సలహాలు ఇవ్వాల్సింది పోయి, విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని మంత్రి సురేష్ విమర్శించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP inter board, AP Schools, Ssc exams

    తదుపరి వార్తలు