హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో వింత.., వేపచెట్టుకు పాలు.., పరుగులు పెడుతున్న జనం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో వింత.., వేపచెట్టుకు పాలు.., పరుగులు పెడుతున్న జనం

వేపచెట్టు నుంచి కారుతున్న పాలు

వేపచెట్టు నుంచి కారుతున్న పాలు

ఈ ప్రపంచంలో ప్రతి రోజూ ఏదోఒక వింత ఘటన చోటు చేసుకుంటూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా భారత్ లో వింతలకు కొదవే లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కృష్ణాజిల్లా (Krishna District)లో వేప చెట్టు నుంచి పాలుకారడం సంచలనం సృష్టిస్తోంది.

ఈ ప్రపంచంలో ప్రతి రోజూ ఏదోఒక వింత ఘటన చోటు చేసుకుంటూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా భారత్ లో కొన్ని వింతలకు కొదవే లేదు. దేవుడు కళ్లుతెరిచాడని, వినాయకుడు పాలు తాగుతున్నాడని, జంతువులు మాట్లాడాయని, కోడికి మూడుకాళ్లు., దూడకు రెండు తలలు అంటూ రోజుకో వార్త వైరల్ అవుతుంటుంది. అలాంటిదే మరో వింత ఆంధ్రప్రదేశ్ లో హల్ చల్ చేస్తోంది. కృష్ణాజిల్లా పెడన మండలం, ఉరమి గ్రామంలో వేప చెట్టుకు పాలు కారుతున్న ఘటన కలకలం రేపింది. ఉరివి పంచాయతీ శివారులోని నరసప్పు చెరువు గ్రామానికి చెందిన రాజనాల లక్ష్మణరావు ఇంటి ఆవరణలో ఉన్న వేప చెట్టు నుంచి పాలు కారడంతో ఆ చెట్టును స్థానికులు వింతగా చూస్తున్నారు. వేప చెట్టుకు పాలుకారడంపై స్థానికులు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఎదో అరిష్టం జరగబోతోందని కొందరంటుంటే.. మరికొందరు మాత్రం అదేం కాదని కొట్టిపాడేస్తున్నారు.

రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుత్తం మండలం పేరాయిచెరువు గ్రామంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దొనిపాటి నాగేశ్వరరావు అనే వ్యక్తి పొలంలో వేప చెట్టు నుంచి రెండు రోజుల పాటు కారాయి. దీంతో గ్రామస్తులు అది దేవతా వృక్షమంటూ పూజలు చేశారు. ఐతే చెట్టు దగ్గర జనం లేనప్పుడు పాలు కారడం ఆగిపోతోందని.., ఎక్కువ మంది జనం వస్తే పాలు ఎక్కువగా వస్తున్నాయని స్థానికు చెప్తున్నారు.


అసలు కారణం ఇదేనా..?

ఐతే వేప చెట్టునుంచి పాలుకారడం అసాధ్యమని నిపుణలు చెప్తున్నారు. వేప చెట్టు లేతగా ఉన్నప్పుడు బెరడను గిల్లితే పాల లాంటి ద్రవం వస్తుందని.. అలాగే పచ్చి వేపకాయలను నొక్కినా సహజంగానే పాలు వస్తాయని అంటున్నారు. అలాగే మర్రి, రావి, మేడి, జిల్లేడి లాంటి చెట్ల ఆకులు, కాయలు, కొమ్మల్ని విరిచిన పాలు కారుతాయని.. ఇందులో వింతలేదంటున్నారు. ఐతే పెద్దపెద్ద చెట్ల నుంచి పాలుకారే అంశంలో మరో వాదన కూడా ఉంది. చెట్ల నుంచి వచ్చే తెల్లటి ద్రవాలు పాలుకావని స్పష్టం చేస్తున్నారు. అలాగే ఏపుగా పేరిగిన వేప చెట్ల కాండం మీద బెరడుకు పగుళ్లు వస్తాయని.. ఆ పగుళ్లలో వేలాది సూక్ష్మజీవులు, చీమలు, చెదలు వంటివి నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. అలా లక్షలాది పురుగులు, గుడ్లు, లార్వాలు ఉన్నచోట చెట్ల కాండం ఒత్తిడి పెరిగినా, వర్షం వచ్చినా అవి చనిపోతాయి. సాధారణంగా కీటకాల రక్తం, కణాలు తెల్లగా ఉండటంతో అవే చెట్టునుంచి కారుతాయని చెప్తున్నారు. దీన్ని పాలు అనుకోవడం లేదా దేవతా వృక్షం అనుకోవడం ఒట్టి మూఢనమ్మకమేనని కొట్టిపారేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, MILK, Vijayawada

ఉత్తమ కథలు