Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH LOVERS ATTACKED BY GIRL RELATIVES IN MANGALAGIRI SU

Andhra Pradesh: ప్రేమజంట‌పై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి.. సినీ ఫక్కీలో పెళ్లి ఆపేశారు.. వీడియో

ప్రేమికులపై దాడి చేసిన అమ్మాయి కుటుం సభ్యులు

ప్రేమికులపై దాడి చేసిన అమ్మాయి కుటుం సభ్యులు

ఓ ప్రేమజంటపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేశారు. మరికొద్ది సేపట్లో వారు పెళ్లి చేసుకోబోతున్న సమయంలో ఈ దాడి జరిగింది.

    ఓ ప్రేమజంటపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేశారు. మరికొద్ది సేపట్లో వారు పెళ్లి చేసుకోబోతున్న సమయంలో ఈ దాడి జరిగింది. అచ్చం సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఇద్దరు ప్రేమికులు చర్చిలో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం మంగళగిరిలోని ఓ చర్చి వద్దకు చేరుకున్నారు. వారిద్దరు వివాహ బంధంతో ఒకటయ్యే సమయం‌లో అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు సినీ స్టైల్‌లో అక్కడికి చేరుకున్నారు. ఆ పెళ్లిని అడ్డుకున్నారు. అనంతరం అమ్మాయిపై దాడి చేసి తమతో పాటు తీసుకెళ్లేందుకు యత్నించారు. అయితే అబ్బాయి దానిని అడ్డుకునేందకు చూశాడు.

    దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి పైన కూడా దాడి చేశారు. అనంతరం అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ప్రేమికులిద్దరు కొత్తపేటకు చెందిన వారిగా తెలుస్తోంది.

    ఈ ఘటనకు సంబంధించి అబ్బాయి తరఫు బంధువులు పోలీసులను ఆశ్రయించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Andhra Pradesh, Guntur, Lovers

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు