హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: 100 కి ఫిర్యాదు వచ్చిందని వెళ్లిన ఎస్సైకు షాకింగ్ ఘటన.. ఏం జరిగింది అంటే?

Vizag: 100 కి ఫిర్యాదు వచ్చిందని వెళ్లిన ఎస్సైకు షాకింగ్ ఘటన.. ఏం జరిగింది అంటే?

X
100కి

100కి ఫిర్యాదు వచ్చిందని వెళ్లిన ఎస్సైకి ప్రమాదం

Vizag: విధుల్లో బిజీగా ఉన్న ఎస్సైకు.. ఫిర్యాదు అందింది. ఓ మహిళ ఆత్మహత్యా చేసికుందని డైల్ 100 ఫిర్యాదు రావడంతో.. రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పెందుర్తి లా అండ్ ఆర్డర్ ఎస్సై రాంబాబు సంఘట స్థలానికి వెళ్లారు. కానీ ఏం జరిగిందంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhapatnam.

ప్రాణాలు కాపాడాలి అనే ఉద్దేశంతో ఫిర్యాదు రాగానే హుటాహుటిన వెళ్లిన ఎస్సైకు ఊహించని ఘటన షాకిచ్చింది. ఉమ్మడి విశాఖ జల్లా.. కొత్త అనకాపల్లి జిల్లాలోని పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ గోవిందపురంలో స్థల వివాదంలో మహిళ ఆత్మహత్యచేసికుందని.. అక్కడి స్థానికుడి నుంచి డయల్ 100 కి ఫిర్యాదు వచ్చింది. అప్పటికి ఆ రాత్రి గస్తీ నిర్వహిస్తున్నపెందుర్తి లా అండ్ ఆర్డర్ ఎస్సై రాంబాబు ఫిర్యాదు అందుకోగానే.. హుటాహుటిన సంఘట స్థలాన్ని వెళ్లారు. 50 అడుగుల బావిలో ఆ మహిళ దూకినట్లు స్థానికులు చెప్పడంతో ఫైర్ సిబ్బందికు సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది రావడంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఒక్కసారిగా బందువులు మృతదేహం చూసి ఆందోళనకు దిగారు.

బంధువుల ఆందోళన మధ్యే..  ఎస్సై రాంబాబు మృతదేహాన్ని అంబులెన్స్ ఎక్కించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న మృతురాలి బంధువులు తోపులాటకు దిగారు. మృత దేహాన్ని తీసుకెళ్లనీయం అంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ  క్రమంలో ఎస్సై అక్కడ జారిపడి పోవడంతో కాలికి తీవ్రమైన గాయమైంది. వెంటనే సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు.

వివరాలు లోకి వెళ్తే.. పెందుర్తి మండలం గోవిందపురంలో అచ్చియమ్మ అనే మహిళ ఆత్మహత్య వివాదాస్పదమైంది. గతరాత్రి ఆమె నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సెప్టెంబర్ 8న అచ్చియమ్మ సోదరుడు సోమేశ్వరరావు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకు న్నారు. స్థానికంగా ఉన్న 70 గజాల స్థలం ప్రభుత్వానిదంటూ.. స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వారికి నోటీసులిచ్చారు. సదరు భూమి తమదేనని చెప్పినా అధికారులు వినిపించుకోకుండా వేధిస్తున్నారని మృతుల కుటుంబ సభ్యులు వాపోయారు.

ఇదీ చదవండి : హిజ్రాలకు కూడా ఇకపై ఐడీ కార్డులు.. వాటితో లాభాలు ఏంటంటే?

స్థానిక వైసిపి నేతలే ఈ ఆత్మహత్యకు కారణమని.. కుటుంబ సభ్యులు ఆరోపించారు. అచ్చియమ్మ మృతదేహానికి పంచనామా నిర్వహించకుండానే పోలీసులు విశాఖ కేజీహెచ్ కు తరలించారు. ఈ సమయంలో పోలీసులు, గ్రామస్థుల కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థల వివాదం వల్ల ఇప్పుడు ఈమె ఆత్మహత్య చేసుకుంది. గతంలో ఈమె సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే కుటుబంలో ఇద్దరూ మృతి చెందారు. ఇంతా జరుగుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టిచుకోవటం లేదు.

ఇదీ చదవండి : ఓల్డ్ ఈజీ గోల్డ్ అంటున్న ప్రజలు.. గానుగ నూనెకు పెరిగిన డిమాండ్.. కారణం ఇదే?

అచ్చియ్యమ్మ మృతదేహాన్ని హడా వుడిగా ఎందుకు తరలించారని తెలుగుదేశం నేతలు పోలీసులను నిలదీశారు. వైకాపా నేతలు పోలీసులను అడ్డు పెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డారని ధ్వజ మెత్తారు. అచ్చియ్యమ్మ తోపాటు ఆమె సోదరుడు సోమేశ్వరరావు మృతిపైనా ప్రైవేటు కేసులు వేస్తామని టిడిపి మాజీ మంత్రి బండారు అన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news, Local News, Road accident, Visakhapatnam

ఉత్తమ కథలు