పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వడాన్ని అన్ని రాజకీయ పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. కూడు, గుడ్డ, నీడలో ఇళ్లు కూడా భాగం కాబట్టి... ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు అంటారు కాబట్టి... ఇల్లు నిర్మించి ఇచ్చి... పేద వాళ్ల కల నెరవేర్చాలని ప్రభుత్వాలు పట్టుదలతో ఉంటాయి. ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో... ఎంతో మంది పేదలు ఉచితంగా స్థలాలు, ఇళ్లు పొందారు. వారంతా వైఎస్ఆర్ను తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన కొడుకైన వైఎస్ జగన్... అధికారంలోకి వస్తూనే... నవరత్నాల హామీల్లో భాగంగా... ఇళ్ల పట్టాలు కూడా ఇస్తానని చెప్పడంతో... మరోసారి పేదలు వైసీపీ వెంట నిలిచారు.
తండ్రి సేవల్ని గుర్తుచేస్తూ... తండ్రి బాటలో నడుస్తూ... వెళ్తున్న జగన్... మొన్ననే దేశం మొత్తం ఆశ్చర్యపోయే రేంజ్లో అంబులెన్సులను ప్రారంభించి... కుయ్ కుయ్ కుయ్ అనే వైఎస్ఆర మాటను ప్రజలకు గుర్తుచేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ పుట్టిన రోజున జులై 8న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని ఎంతగానో ఏర్పాట్లు చేసుకున్నారు. ఐతే... తాజాగా... అధికారులు ఆయనతో సమావేశం అయ్యారు. వారి ముఖాల్లో ఏదో తెలియని ఆందోళన. "ఏం జరిగింది" అని అడిగితే... "సార్... ఇళ్ల పట్టాల పంపిణీకి కోర్టు సమస్యలు ఎదురవుతున్నాయి" అన్నారు. "ఏంటీ... ఎందుకూ" అంటూ.. సీఎం జగన్... అసలేం జరుగుతోందో క్లియర్గా తెలుసుకున్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో భూమిని సేకరించింది. ఐతే... కొన్ని చోట్ల భూమిపై కోర్టు వివాదాలు ఉన్నాయి. అవన్నీ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి. వాటిపై ఇప్పుడు విచారణ కోరదామంటే... ఇంకా ఒక్క రోజే సమయం ఉంది. అందువల్ల ఇంత తక్కువ సమయంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం సాధ్యం కాదని అధికారులు చెప్పడంతో... ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చే పట్టాలపై ఎలాంటి వివాదాలూ, కేసులూ ఉండకూడదన్న సీఎం జగన్... ఆగస్ట్ 15 లోపు అన్నీ సెట్ చెయ్యాలని సూచించారు. ఆగస్ట్ 15న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుందని తెలిసింది.
Published by:Krishna Kumar N
First published:July 06, 2020, 12:26 IST