హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Number One: సంక్షేమంలో ఏపీ నెంబర్ వన్.. ఇప్పటి వరకు ఎంత నగదు విడుదల చేశారంటే?

AP Number One: సంక్షేమంలో ఏపీ నెంబర్ వన్.. ఇప్పటి వరకు ఎంత నగదు విడుదల చేశారంటే?

సంక్షేమంలో జగనే నెంబర్ వన్

సంక్షేమంలో జగనే నెంబర్ వన్

AP Number One: సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జగన్ కు ఎవరూ సాటి లేరనే చెప్పాలి. ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఉన్నా..? పథకాలు విడుదల చేయడంలో వెనుకడుగు వేయడం లేదు.. సీఎంగా జగన్.. ఈ నాలుగేళ్ల పాలనలో పథకాల కోసం ఎన్ని కోట్లు విడుదల చేశారో తెలుసా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

AP Number One: ఆంధ్రప్రదేశ్ (Andhra Prdesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సంక్షేమ రారాజు అనిపించుకుంటున్నారు. రాష్టానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా..? ఆదాయం తక్కువగా ఉన్నా.. కరోనా మహమ్మారి (Corona Virus) తో ఆదాయ మార్గాలు మూసుకుపోయినా.. సంక్షేమానికి ఎక్కడా బ్రేకులు వేయలేదు. అంతేకాదు దేశంలో  మరే రాష్ట్ర సీఎం చేయని విధంగా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలతో (Welfare Schemes) పాటు, ఎన్నికల్లో హామీ ఇచ్చిన నవరత్నాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాలకు 3 లక్షల కోట్లకుపైగా నగదు బదిలీ చేశారు. నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా బటన్ నొక్కి నగదు జమ చేయడం ఇక్కడ మరో విశేషం.

డీబీటీ ద్వారా నేరుగా జమ చేసిన పథకాలు:                                                                          జగనన్న అమ్మఒడి రూ.19674 కోట్లు.. జగనన్న వసతి దీవెన రూ.4275 కోట్లు.. జగనన్న విద్యా దీవెన రూ.9947 కోట్లు.. జగనన్న విదేశీ విద్యా దీవెన రూ.132 కోట్లు.. రైతు భరోసా రూ.27062 కోట్లు.. వైఎస్ఆర్ పింఛను కానుక రూ.70318 కోట్లు.. చేయూత రూ.14129 కోట్లు.. వైఎస్ఆర్ ఆసరా రూ.19178 కోట్లు.. ఆరోగ్యశ్రీ రూ.971 కోట్లు.. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం రూ.1257 కోట్లు.. సున్నావడ్డీ పథకం రూ.3615 కోట్లు.. సూక్ష్మ చిన్న పరిశ్రమలకు రాయితీలు రూ.2086 కోట్లు.. గృహనిర్మాణం రూ.9151 కోట్లు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా బటన్ నొక్కి సీఎం జగన్ రెడ్డి జమ చేశారు.

 నాన్ డీబీటీ సంక్షేమ పథకాలు:

జగనన్న గోరుముద్ద రూ.3590 కోట్లు.. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ రూ.6141 కోట్లు.. జగనన్న విద్యా కానుక రూ.2368 కోట్లు.. పేదల ఇళ్ల నిర్మాణానికి సెంటు భూమి రూ.75670 కోట్లు.. ఖర్చు చేశారు. మొత్తం మీద వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రూ.3,01,304 కోట్లు ఖర్చు చేశారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా  10,45,92,639 మంది లబ్ది పొందారు.

ఇదీ చదవండి : ఏపీ తరువాత సీఎం ఆయనే.. చిలక చెప్పిన జోస్యం ఇదే..

2019-20 రాష్ట్ర బడ్జెట్ లో జగనన్న విద్యాదీవెన పథకానికి కింద 1,810.56 కోట్లు, అమ్మ ఒడి పథకానికి 6,455.80 కోట్లు కేటాయించారు. జగనన్న అమ్మఒడి కింద 44.5 లక్షల సాయం అందించారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద 13.26 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు మైనారిటీ విద్యార్థుల ఫీజును రూ.4879 కోట్లతో రీయింబర్స్ చేశారు. జగనన్న వసతి దీవెన కింద 10.89 లక్షల మంది అర్హులైన SC,ST, BC, కాపు, మైనారిటీ విద్యార్థులకు ఆహారం & హాస్టల్ ఖర్చులకు మద్దతు కల్పించారు.

ఇదీ చదవండి : ఐదు శతాబ్దాల వ్యాపార కేంద్రం.. బందరు ఓడరేవు చరిత్ర ఇది..

YSR ఆరోగ్యశ్రీ  రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను పునరుద్ధరించడం, 144.07 లక్షల కుటుంబాలు వార్షిక ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉన్నందున ప్రయోజనం పొందేందుకు 1,577 నెట్‌వర్క్ ఆసుపత్రులు ఎంప్యానెల్ చేయబడ్డాయి మరియు 2,436 విధానాలు పథకం కింద కవర్ చేయబడ్డాయి. YSR ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద సేవలు 1,484 ఎంప్యానెల్డ్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ మరియు 1059 విధానాలను కవర్ చేస్తాయి. పథకం కింద 533670 మంది రోగులు రూ.1902.35 కోట్లతో లబ్ధి పొందుతున్నారు. ఆపరేషన్ అనంతర జీవనోపాధి భత్యం @ రూ.225/- రోజుకు గరిష్టంగా రూ. 5000/- నెలకు. కోవిడ్-19 చికిత్స & కోవిడ్-19 అనంతర ఆహారాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురాబడ్డాయి. సంప్రదింపుల నుండి వైద్యం వరకు, కోవిడ్-19 చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ఆరోగ్యశ్రీ భరిస్తుంది. ఇంకా ఎన్నో ఉన్నాయి,

ఇదీ చదవండి : అధికార పార్టీకి ఊహించని షాక్.. ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి.. గ్రామం మొత్తం ఖాళీ..? ఎందుకంటే?

ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండటంతో ఏపీలో సంక్షేమ పథకాలకు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. పేదలే లక్ష్యంగా సీఎం జగన్ రెడ్డి పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ పథకాల ద్వారా 10 కోట్ల 45 లక్షల మంది ప్రయోజనం పొందారు. రాబోయే ఏడాది కాలంలో మరికొంత మంది లబ్ది పొందే అవకాశం ఉంది. ఇప్పటికే నవరత్నాలకు తోడు అనేక సంక్షేమ పథకాల్లో అమల్లో పెట్టారు. వీటిని అమలు చేయడంలో క్యాలెండర్ రూపొందించి చెప్పటిన తేదీన లబ్దిదారులకు డీబీటీ ద్వారా నగదు జమ చేస్తూ ఎక్కడా అవినీతికి తావు లేకుండా చేశారు. ఎన్నికలకు మరో ఏడాది కాలం ఉండటంతో ఇప్పటికే గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన అన్ని పథకాలను పూర్తి చేయనున్నారు. కొత్తగా పథకాలు పెట్టే ఆలోచన లేకపోయనా, ఉన్న పథకాలకు నిధులు పారించే అవకాశం ఉంది.

First published:

Tags: Andhra pradesh news, Ap government, AP News, Ap welfare schemes, Ys jagan mohan reddy

ఉత్తమ కథలు