(Anna Raghu,Sr.Correspondent,Amaravathi,News18)
ఏపీలో వ్యభిచార వృత్తి(Prostitution)విస్తరిస్తోంది. వేశ్యా వృత్తిలోకి దిగే వారి సంఖ్య ఏపీలో ఏటా పెరుగుతోంది. ఏటా 10 నుంచి 15 శాతం పెరుగుతోంది. కొత్తగా ఈ వృత్తిలోకి వస్తున్న వారి వయసు సగటున 18 నుంచి 40 మధ్యలో ఉంటోంది. కుటుంబ పరిస్థితులు, విలాసాలకు అలవాటు పడి మహిళలు ఈ వృత్తిలోకి దిగుతున్నారు. వ్యభిచారం విచ్చలవిడిగా పెరిగిపోవడంతో హెచ్ ఐ వీ(HIV)కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర(Maharashtra)లో 3.94 లక్షలు, కర్ణాటక(Karnataka)లో 2.76 లక్షలుండగా ఏపీలో 2.09 లక్షల కేసులతో దేశంలోనే మూడో స్థానంలో ఉంది.
పేదరికమే ప్రధాన కారణం..
సెక్స్ కార్మికులు ఏపీలోనే అధికంగా ఉన్నారు. ఏపీలో 1.33 లక్షల మంది సెక్స్ కార్మికులు ఉన్నారని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ, సేవా సంస్థలు సేకరించిన సమాచారం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెక్స్ కార్మికుల సంఖ్య అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉంది. తరవాత కర్నూలు , చిత్తూరు జిల్లాల్లో సెక్స్ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. జీవనోపాధి లేక రాయలసీమ జిల్లాల్లో చాలా మంది ఈ వృత్తిలోకి వస్తున్నారు. రాయలసీమలో బెంగళూరు హైదరాబాద్ , చెన్నై జాతీయ రహదారులు ఉండటం కూడా ఇందుకు కారణం. సెక్స్ వర్కర్లలో 1450 మందికి హెచ్ ఐ వి సోకినా వృత్తిని వీడటం లేదు. మందులు వాడుకుంటూ వృత్తిని కొనసాగిస్తున్నారు. మహారాష్ట్రలో నేటివ్ సెక్స్ వర్కర్లు 59,785 మంది ఉండగా, ఢిల్లీలో 46,786, మిజోరంలో అతి తక్కువగా 833 మంది ఉన్నారు.
వ్యభిచారవృత్తిలో వలస కార్మికులు కూడా ఎక్కువే..
పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఏపీలో వేశ్యా వృత్తి కొనసాగిస్తున్నవారు 11639 మంది ఉన్నారు. ఒడిషా, ఛత్తీస్ గడ్, అసోం, బిహార్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. నిర్మాణ రంగంలో పనిచేస్తూ కొందరు వేశ్యావృత్తిని కొనసాగిస్తున్నారు.వివిధ రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వలసవెళ్లి సెక్స్ వర్కులో కొనసాగుతున్న వారు 6.06 లక్షల మంది ఉన్నారు. గుజరాత్ లో 2.08, ఢిల్లీలో 1.85 లక్షల మంది ఉన్నారు.
దేశంలో ఏపీ నెంబర్ వన్ స్థానం..
ఏపీ మొదటి స్థానం2021 జనవరి నుంచి సెప్టెంబరు మధ్య జరిగిన అధ్యయనంలో దేశ వ్యాప్తంగా 8.25 లక్షల మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నారు. వీరిలో 1.33 లక్షల మందితో ఏపీ తొలి స్థానంలో ఉంది. కర్నాటకలో 1.16 లక్షలు, తెలంగాణలో లక్ష మంది, తమిళనాడులో 65 వేల మంది చొప్పున ఉన్నారు. ఏపీలో ప్రస్తుతం 65 వేల మంది సెక్స్ వర్కర్లు నివాసం ఉంటున్నారు. 2022 నాటికి ఈ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Prostitution