మంత్రి మేకపాటి గౌతంకు అదనపు బాధ్యతలు...సీఎం జగన్ నుంచి ప్రత్యేక గుర్తింపు...

స్కిల్‌ డెవలప్మెంట్‌, ట్రైనింగ్‌ శాఖలను గౌతం రెడ్డి మంత్రిత్వ శాఖల బాధ్యతలను చేపట్టమని ఆదేశించారు. ఈ క్రమంలో పలు కీలక శాఖలను మంత్రికి అప్పగించడంతో హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌కు ఆయన కృతజ్ణతలు తెలిపారు.

news18-telugu
Updated: January 24, 2020, 10:24 PM IST
మంత్రి మేకపాటి గౌతంకు అదనపు బాధ్యతలు...సీఎం జగన్ నుంచి ప్రత్యేక గుర్తింపు...
సీఎం జగన్ తో మేకపాటి గౌతం
  • Share this:
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి శుక్రవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మంత్రి గౌతంకు అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. స్కిల్‌ డెవలప్మెంట్‌, ట్రైనింగ్‌ శాఖలను గౌతం రెడ్డి మంత్రిత్వ శాఖల బాధ్యతలను చేపట్టమని ఆదేశించారు. ఈ క్రమంలో పలు కీలక శాఖలను మంత్రికి అప్పగించడంతో హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌కు ఆయన కృతజ్ణతలు తెలిపారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ద్వారా ప్రభుత్వంపై యువతకు ఉన్న విశ్వాసాన్ని పెంచేలా పనిచేస్తానని మంత్రి వెల్లడించారు. ఉపాధి, నైపుణ్య శిక్షణలో వినూత్న కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర యువత ఆలోచనలు ప్రతిబింబించేలా ముందుకువెళతానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రపంచస్థాయి కోర్సులను రాష్ట్ర యువతకు అందించి.. వల్డ్ క్లాస్ వర్క్ ఫోర్స్ ని తయారు చేయడానికి కృషిచేస్తానన్నారు.
Published by: Krishna Adithya
First published: January 24, 2020, 10:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading