AP Rains: ఏపీలో వర్షాల వల్ల రూ.10వేల కోట్ల పంట నష్టం

AP Rains: ఏపీలో వర్షాల వల్ల రూ.10వేల కోట్ల పంట నష్టం

వరద నష్టంపై సీఎం జగన్ ఏరియల్ సర్వే (File)

ఏపీలో జరిగిన వరద నష్టంపై అంచనా వేసేందుకు కేంద్ర అధికారుల బృందం నవంబర్ రెండో వారంలో రాష్ట్రానికి రానుంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల వల్ల రూ.10వేల కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వ అధికారులు అంచనా వేశారు. ఏపీలో జరిగిన వరద నష్టంపై అంచనా వేసేందుకు కేంద్ర అధికారుల బృందం నవంబర్ రెండో వారంలో రాష్ట్రానికి రానుంది. నవంబర్ 9,10 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించి, వరద నష్టం అంచనాపై వేయనుంది. గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ఆ బృందం పర్యటించనుంది. ఈ క్రమంలో పంట, ఆస్తి నష్టం అంచనాలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది. రెండు రోజుల్లో నష్టంపై తుది అంచనాలను అధికారులు సమర్పించనున్నారు. వరదల కారణంగా 12 శాఖలకు సంబంధించి భారీగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు రూ.10వేల కోట్ల మేర పంట నష్టం జరిగినట్టు గుర్తించారు. రోడ్లు, వ్యవసాయ, ఆక్వా ఉద్యాన పంటలు, విద్యుత్, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలకు భారీగా నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. ఆర్అండ్ బీకి సుమారు రూ.5వేల కోట్ల నష్టం జరిగిందని లెక్కలు సిద్ధం చేస్తున్నారు. దాదాపు 2.40 లక్షల రైతులపై వరద ప్రభావం చూపింది. ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వారంగం దారుణంగా దెబ్బతింది. ప్రభుత్వం రూపొందించిన వరద నష్టం నివేదికను కేంద్ర బృందానికి అందచేయనుంది. తక్షణ సాయంగా రూ.1000కోట్లు అడగాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రోడ్ల మరమ్మత్తులు, రైతులు ఇన్ పుట్ సబ్సిడీ కోసం అత్యవసరంగా రూ.1000 కోట్లు అవసరమని అధికారుల అంచనా వేశారు.

    ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ ఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు వారాల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. నష్టం వివరాలు అంచనా మొత్తాన్ని లేఖలో వివరించారు. తక్షణ సహాయంగా రూ.1000 కోట్లు విడుదల చేయాలని లేఖ ద్వారా కోరారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఆర్ధికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని వరదలు , భారీ వర్షాలు ముంచెత్తాయన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలని వైఎస్ జగన్ కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం కారణంగా రాష్ట్రంలో ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు భారీ వర్షాలు పడ్డాయి. ఈ నెల 13వ తేదీ ఒక్కరోజులోనే తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరంలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదికి వరద పోటెత్తింది.

    మరోవైపు జూన్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలకు ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేస్తూ ఏపీ సర్కార్ ఈనెల 26న ఉత్తర్వులు జారీ చేసింది. నష్టపోయిన వ్యవసాయ పంటలకు రూ. 113 కోట్లు, ఉద్యాన పంటలకు రూ. 22 కోట్ల చొప్పున ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 33 శాతానికంటే ఎక్కువగా దెబ్బ తిన్న పంటలకు సబ్సిడీ విడుదలైంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, విశాఖ జిల్లాల్లోని రైతులకు సబ్సిడీ విడుదల చేశారు. నేరుగా రైతుల ఖాతాల్లోకి చెల్లింపులు జరపాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు