ANDHRA PRADESH IN ISRO SPACE CHALLENGE SOCIAL WELFARE SCHOOL STUDENTS SELECTED EVK
Andhra Pradesh: ఇస్రో స్పేస్ ఛాలెంజ్‌లో సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థినుల సత్తా.. ఏం తయారు చేశారో తెలుసా?
ఇస్రోలో (PC: ISRO)
ATL Space Challenge 2021 | ఇస్రో, సీబీఎస్ఈ సంయుక్తంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ స్పేస్ చాలెంజ్ 2021 కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీకి చెందిన తొమ్మిది మంది విద్యార్థినులు తమ సత్తా చాటారు.
ఇస్రో, సీబీఎస్ఈ (CBSE) సంయుక్తంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ స్పేస్ చాలెంజ్ 2021 (Atal Innovation Mission Space Challenge 2021) కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (Andhra Pradesh Social Welfare Residential Educational Institutions Society)కి చెందిన తొమ్మిది మంది విద్యార్థినులు తమ సత్తా చాటారు. ఈ కార్యక్రమంలో 75 మంది విజేతల జాబితాలో ఈ పాఠశాల విద్యార్థినులు తమ సైన్స్ ప్రాజెక్ట్‌కు చోటు దక్కించుకోవడం విశేషం. గెలుపొందిన ప్రాజెక్ట్‌లలో మూడు ఆంధ్ర ప్రదేశ్‌కు చెందినవి అన్నీ APSWREIS నుంచి వచ్చినవే కావడం విశేషం. ముగ్గురు బాలికలతో కూడిన మూడు విజేత జట్లు, APSWR సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, మధురవాడ, విశాఖపట్నం, APSWR, మార్కాపూర్, ప్రకాశం, APSWR, నెల్లిమర్ల, విజయనగరం నుంచి వచ్చాయి.
ధావన్ స్పేస్ రోవర్, అంతరిక్షంలో ప్రయాణించగల ఒక వర్కింగ్ ప్రోటోటైప్ మోడల్‌ను విశాఖపట్నంలోని మధురవాడలో ఉన్న AP సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి 8వ తరగతికి చెందిన ఊర్మిళ, Y జెస్సికా, 9వ తరగతికి చెందిన E అరుంధతి అభివృద్ధి చేశారు. తాము చేసిన సైన్స్ ప్రాజెక్ట్‌ను వివరిస్తూ.. జెస్సికా తమ బృందం "మేము మా ప్రిన్సిపాల్, ATL ఇన్‌చార్జి రాంబాబు మార్గదర్శకత్వంలో ఈ నమూనాను తయారు చేయడానికి పని చేశామని తెలిపారు. ఇది ఏ గ్రహం మీదనైనా ప్రయాణించగలదు," అని విద్యార్థినులు ధీమా వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు విశేషాలు..
- ఈ రోవర్‌లో ఆరు చక్రాల మోటారు మరియు రెండు బోగీలు ఉంటాయి.
- ఈ రోవర్ ఏ ప్రాంతంలోనైనా ప్రయాణించేలా రూపొందించారు.
- 2,500 ప్రాజెక్టులు ఈ పోటీకి వచ్చాయి. ఇందులో నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యార్థిను ప్రాజెక్ట్ ఎంపికైంది.
విజయనగరంలోని APSWR నెల్లిమర్ల 9వ తరగతికి చెందిన జి లావణ్య, ఆర్ పూజిత, కె చిన్నమ్మి వారి ‘క్రియేటివ్ మోడల్ ఆఫ్ 3డి ప్రజ్ఞాన్ రోవర్’కి ఈ పోటీలో గుర్తింపు వచ్చింది. ఈ విజయం విద్యార్థినులు మాట్లాడారు. తమ ఫిజిక్స్ టీచర్ ఐ సీతమ్మ, స్కూల్ ప్రిన్సిపాల్ ఎ రాణిశ్రీ మరియు APSWREIS జిల్లా కోఆర్డినేటర్ బి చంద్రావతి మార్గదర్శకత్వంలో వర్చువల్ మోడ్‌లో తమ ప్రాజెక్ట్‌ను సమర్పించామని తెలిపారు. ఈ విజయానికి వారు ఎంతో సహకరించారని అన్నారు.
APSWR అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. అటల్ ఇన్నోవేషన్ మిషన్, ISRO, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరియు NITI ఆయోగ్ ద్వారా వర్చువల్ మోడ్‌లో జరిగిన ఇన్నోవేషన్, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీపై సెషన్‌లకు హాజరయ్యే అవకాశం ఈ మూడు బృందాలకు లభించిందని తెలిపారు. ఈ బృందాలు ఇస్రో, నీతి ఆయోగ్ నుంచి బహుమతులు అందుకుంటాయని అధికారులు చెప్పారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.