సీఎం జగన్‌కు బిగ్ షాక్.. ఏపీ మూడు రాజధానులపై హైకోర్టు స్టే

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై గవర్నర్ ఇచ్చిన గెజిట్‌పై మంగళవారం స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది హైకోర్టు.

news18-telugu
Updated: August 4, 2020, 4:56 PM IST
సీఎం జగన్‌కు బిగ్ షాక్.. ఏపీ మూడు రాజధానులపై హైకోర్టు స్టే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. మూడు రాజధానులపై హైకోర్టు స్టే విధించింది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదిస్తూ గవర్నర్ ఇచ్చిన గెజిట్‌పై మంగళవారం స్టేటస్ కో విధించింది. రిప్లై కౌంటర్‌కు 10 రోజులు గడువు ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరడంతో.. అప్పటి వరకు యథాతధ స్థితిని కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది.

ఏపీ 3 రాజధానులకు గవర్నర్ ఆమోద ముద్రవేయడాన్ని రాజధాని రైతు పరిరక్షణ సమితి తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలోనే సోమవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జీఎన్ రావు, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమని ప్రకటించాలన్న పిటిషనర్ కోర్టును కోరారు. రాజ్ భవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు గవర్నర్ గెజిట్‌పై స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు జులై 31న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్రవేశారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా గవర్నర్ ఆమోదించారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ హరిచందన్ ఆమోదం తెలపడంతో విశాఖపట్నం అధికారికంగా పరిపాలనా రాజధాని కానుంది. అలాగే, అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. హైకోర్టు కర్నూలుకు తరలివెళ్లనుంది. ఆగస్టు 15 వరకు అన్ని కార్యాలయాలను విశాఖకు తరలించాలని భావిస్తున్న వేళ..ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Published by: Shiva Kumar Addula
First published: August 4, 2020, 4:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading