Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH HIGH COURT SLAMS AP DGP GOWTHAM SAWANG SK

డీజీపీపై హైకోర్టు ఆగ్రహం.. చేతకాకుంటే రాజీనామా చేయండి..

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏపీ హైకోర్టు

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏపీ హైకోర్టు

పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ పదవికి రాజీనామా చేయాలని గౌతం సవాంగ్‌పై విరుచుకుపడింది.

    ఆంధ్రప్రదేశ్ డీజీపీపై గౌతమ్ సవాంగ్ (Goutam Sawang)పై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పోలీస్ వ్యవస్ద గాడి తప్పుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు విషయంలో డీజీపీ తీరును తప్పుబట్టిన హైకోర్టు.. ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని మండిపడింది. గతంలో డీజీపీని పలుసార్లు కోర్టుకు పిలిపించినప్పటికీ ఆయనలో మార్పు రాలేదన్న న్యాయస్థానం... పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ పదవికి రాజీనామా చేయాలని గౌతం సవాంగ్‌పై విరుచుకుపడింది.

    అసలేం జరిగిందంటే..
    తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అదృశ్యంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలైంది. వెంకటరాజు కేసు విషయంలో పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. గతంలోనూ మూడు కేసుల్లో జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని మండిపడింది. ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందన్న హైకోర్టు.. ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని స్పష్టం చేసింది. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఓ లాయర్ కేసులోనూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జిల్లా ఎస్పీని కోర్టుకు పిలిపించి మొట్టికాయలు వేసింది. ఈ క్రమంలో తాజాగా డీజీపీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP DGP, AP High Court, AP News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు