• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • ANDHRA PRADESH HIGH COURT SENTENCED PRISON FOR IAS OFFICERS FOR THIS REASON FULL DETAILS HERE PRN

Andhra Pradesh: ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష... హైకోర్టు సంచలన తీర్పు

ఏపీ హైకోర్టు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) సంచలన తీర్పు ఇచ్చింది. ఓ కేసులో ఏకంగా ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు గిరిజా శంకర్, చిరంజీవి చౌదిరలకు వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది. ప్రభుత్వంలో 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఏప్రిల్ లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత బాధ్యతలు చూస్తున్న అధికారులు గిరిజా శంకర్, చిరంజీవి చౌదరి కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు. దీంతో కోర్టు ధిక్కరణపై పిటిషన్ దాఖలవగా విచారించిన హైకోర్టు.. ఇద్దరు అధికారులను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. మంగళవారం ఇద్దరు అధికారులు కోర్టుకు హాజరుకాగా.. హైకోర్టు ఆదేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరికీ వారం రోజులపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పువెలువరించింది.
    Published by:Purna Chandra
    First published: