ఎల్‌జీ పాలిమర్స్‌పై హైకోర్టు కీలక తీర్పు.. ఏం చెప్పిందంటే..

దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. దీనిపై గతంలోనే రిట్ పిటిషన్ దాఖలైనందున పిల్ అవసరం లేదని తెలిపింది. పిల్ వేయడంలో రామకృష్ణారెడ్డి ఆసక్తి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.

ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని, కంపెనీలోకి ఎవ్వరినీ అనుమతించొద్దని ఆదేశించింది. కంపెనీ డైరెక్టర్లు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని, డైరెక్టర్లు వారి పాస్ పోర్టులను స్వాధీనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

  • Share this:
    దేశవ్యాప్తంగా సంచలనం స‌ృష్టించిన విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. విశాఖలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని, కంపెనీలోకి ఎవ్వరినీ అనుమతించొద్దని ఆదేశించింది. దీనికితోడు ఆ కంపెనీ డైరెక్టర్లు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని, డైరెక్టర్లు వారి పాస్ పోర్టులను స్వాధీనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. అందులో భాగంగానే విచారణకు సంబంధించి ఆదివారం లిఖితపూర్వక ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం, ఎల్‌జీ పాలిమర్స్ తరపున న్యాయవాదులు హైకోర్టుకు వాదనలు విన్పించారు. గ్యాస్ లీకేజీ తర్వాత స్టైరీన్‌ను ఇక్కడి నుంచి ఎవరి అనుమతితో తరలించారని కోర్టు ప్రశ్నించింది. పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీకి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసింది.
    Published by:Narsimha Badhini
    First published: