• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANDHRA PRADESH HIGH COURT ORDERS PUNISHMENT AND FINE TO AP ASSEMBLY SECRETARY BALAKRISHNAMACHARYULU BA

AP High Court: ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి శిక్ష, జరిమానా

AP High Court: ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి శిక్ష, జరిమానా

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు ఏపీ హైకోర్టు శిక్ష, జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని తీర్పునిచ్చిన కోర్టు ఆయనకు శిక్ష, జరిమానా వేసింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు ఏపీ హైకోర్టు శిక్ష, జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని తీర్పునిచ్చిన కోర్టు ఆయనకు శిక్ష, జరిమానా వేసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి 2017లో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో విఫలం అయినందుకు కోర్టు ధిక్కరణ కింద భావించిన న్యాయస్థానం ఆయనకు శిక్ష వేసింది. కోర్టు సమయం ముగిసే వరకు ఆయన న్యాయస్థానంలో కూర్చుకోవాలని ఆదేశించింది. అలాగే, రూ.1000 జరిమానా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించని పక్షలో వారం రోజుల సాధారణ జైలు శిక్ష విధించాలని న్యాయస్థానం ఆదేశించింది. డిసెంబర్ 30న ఏపీ హైకోర్టు ఓ ఐఏఎస్ అధికారిపై కేసు నమోదు చేయాలని తీర్పునిచ్చింది. మిషన్‌ బిల్డ్ ఏపీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన మిషన్ బిల్డ్ అధికారి ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తరఫున తప్పుడు అఫిడవిట్ సమర్పించడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం కింద కేసు నమోదు చేయాలని సూచించింది. క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ కింద కేసు దాఖలుకు రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు హైకోర్టు ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిక్విజల్ పటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: