ఏపీలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. దర్యాప్తు ఎందుకు జరపకూడదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎల్లుండిలోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. ఈ కేసు విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది.
అంతకుముందు ఏపీలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగంలో ఆర్టికల్స్ 19, 21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. వైసీపీ ద్వారా ఇది జరుగుతోందని విమర్శించారు. తద్వారా ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారని ప్రధానికి రాసిన లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.