Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH HIGH COURT MADE INTERESTING COMMENT ON CHINTAMANI STAGE SHOW BAN FULL DETAILS HERE PRN

Chintamani: చింతామణికి రామాయణానికి లింక్.. రఘురామ ఎంట్రీతో వాడివేడి వాదనలు..

చింతామణి నాటకం (ఫైల్)

చింతామణి నాటకం (ఫైల్)

చింతామణి నాటకంలోని (Chintamani) సుబ్బిశెట్టి పాత్ర తమ సామాజిక వర్గాన్ని కించపరిచేదిగా ఉందని ఆర్యవైశ్య సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం నాటక ప్రదర్శనపై నిషేధం విధించింది. ఐతే ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు కళాకారులు, రాజకీయ నేతలు హైకోర్టులో సవాల్ చేశారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (ANdhra Pradesh) ప్రభుత్వం ఇటీవల చింతామణి (Chintamani) నాటకాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. నాటకంలోని సుబ్బిశెట్టి పాత్ర తమ సామాజిక వర్గాన్ని కించపరిచేదిగా ఉందని ఆర్యవైశ్య సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం నాటక ప్రదర్శనపై నిషేధం విధించింది. ఐతే ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు కళాకారులు, రాజకీయ నేతలు హైకోర్టులో సవాల్ చేశారు. నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు కూడా చింతామణిపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం హైకోర్టులో వాడివేడి విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే చింతామణి నాటకాన్ని నిషేధానికి మద్దతుగా ఆర్యవైశ్య సంఘాలు దాఖలు చేస్తున్న ఇంప్లీడ్ పిటిషన్ల సంఖ్య పెరుగుతోంది.

    చింతామణని నాటకాన్ని నిషేధాన్ని సమర్ధిస్తూ ఆర్యవైశ్య సంఘాల తరఫున తాజాగా మరో మూడు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంప్లీడ్ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. అసహనం వ్యక్తం చేసింది. 100 లేక 200 పిటిషన్లు వేస్తారా అని ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి.. విచారణను సాగదీసేందుకే ఇంప్లీడ్ పిటిషన్లు వేస్తున్నారా అని నిలదీశారు. అనంతరం సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వేసిన ఇంప్లీడ్ పిటిషన్ ను మాత్రమే హైకోర్టు అనుమతించింది.

    ఇది చదవండి: విజయసాయికి చెక్ పెట్టేందుకు ఆ వైసీపీ నేత స్కెచ్..? ఎంపీ పదవి రాకుండా అడ్డుకుంటున్నారా..?


    ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ పై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. తాము కేవలం అభ్యంతరం ఉన్న పాత్రను మాత్రమే నిషేధించాలని కోరుతున్నామన్నారు. మొత్తము నాటకాన్ని ఎలా నిషేధిస్తారు అని ప్రశ్నించిన ఉమేష్కన్యాశుల్కం నాటకంలో అభ్యంతరాలున్నాయని చెబితే మొత్తం నాటకాన్ని నిషేధిస్తారా అని వాదించారు. అంతేకాదు రామాయణంలో అభ్యంతరకర పాత్రలు ఉన్నాయని ఏకంగా రామాయణాన్నే నిషేధించమంటే ఎలా అని ప్రశ్నించారు. 100 సంవత్సరాల నుంచి ప్రదర్శిస్తున్న నాటకాన్ని ఎలా నిషేధిస్తారని.. ఇది సరికాదని వాదించారు.

    ఇది చదవండి: టాలీవుడ్ పై సీఎం జగన్ ఫోకస్.. మంత్రితో కీలక చర్చలు.. ఆ మీటింగ్ పైనే దృష్టి..


    ఇక ఆర్టిస్టుల తరుపున న్యాయవాది శ్రవణ్ కుమార్ వేసిన పిటిషన్ కూడా ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కి బదిలే చేయగా.. ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరు తదపువరి విచారణను రెండువారాల పాటు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే గత విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నాటకంలో పాత్రలపై అభ్యంతరం ఉంటే పాత్రను తొలగించాలని గానీ.. నాటకం మొత్తాన్ని ఎలా నిషేధిస్తారని ప్రశ్నించింది. విచారణలో భాగంగా చింతామణి పుస్తకంపై నిషేధం విధించారా..? అని సర్కార్ ను కోర్టు ప్రశ్నించింది. అదేం లేదని న్యాయవాదులు తెలపగా.. పుస్తకాన్ని నిషేధించకుండా నాటకాన్ని ఎలా నిషేధిస్తారని నిలదీసింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు