Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH HIGH COURT KEY COMMENTS ON GOVERNMENT EMPLOYEES PROTEST GOVERNMENT HAD RIGHT TO SALARY NGS GNT

AP PRC: ఉద్యోగుల సమ్మెలో ట్విస్ట్.. జీతాలు తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంది.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీ హైకోర్టు (ఫైల్)

ఏపీ హైకోర్టు (ఫైల్)

AP Highcourt on PRC Issue: ప్రభుత్వం ఉద్యోగుల సమ్మెలో ట్వీస్ట్.. ఉద్యోగ సంఘాల 12 మంది నేతలను హైకోర్టు విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చింది. దీంతో కోర్టు ఏం చెబతుందునే ఆసక్తి అందరిలో పెరిగింది.. ఇప్పటికే జీతాలు తగ్గించే హక్కు ప్రభుత్వానిదే అని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇంకా చదవండి ...
    AP High Court on PRC Issue:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రభుత్వానికి, ఉద్యోగుల మధ్య పీఆర్సీ ఫైట్ (PRC Issue) తారా స్థాయికి చేరింది.  ప్రభుత్వం చెబుతున్న పీఆర్సీ లెక్కలకు నిరసనగా వచ్చేనెల 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని ఇప్పటికే పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయలు, కార్మికులు, పెన్షనర్లతో కూడిన పీఆర్సీ సాధన సమితి సమ్మెపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం సీఎస్ సమీర్ శర్మకు నోటీసులిచ్చేందుకు ఉద్యోగులు సిద్ధమయ్యారు. అలాగే ప్రభుత్వంతో 12 గంటలకు జరగాల్సిన చర్చలకు కూడా హాజరు కాలేదు.. దీతో సమ్మె తప్పుదు అనుకున్న సమయంలో ట్వీస్ట్ చోటుసుకుంది. సమ్మె వ్యవహరాం కోర్టుకు చేరింది. తాజాగా పీఆర్సీ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేేసింది. ఉద్యోగుల జీతాలు తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే తరువాత జరగనున్న విచారణకు సమ్మెకు నోటీసులు ఇచ్చిన 12 ఉద్యోగ సంఘాల నేతలు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏం చేద్దామంటూ ఉద్యోగ సంఘాల నేతలు తర్జనబర్జన పడుతున్నారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఆర్సీని సవాల్ చేస్తూ.. ఉద్యోగులు (Employees) హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court)  విచారించింది. ఈ సందర్భంగా పీఆర్సీ(PRC) దాఖలైన పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీతాలు పెంచే అధికారం, అలాగే తగ్గించాలి ప్రభుత్వాలకు ఉంటుందని తేల్చి చెప్పేసింది. అంతేకాదు. పీఆర్సీ పర్సంటేజ్‌లపై చాలెంజ్ చేసే హక్కు ఉద్యోగులకు లేదని అభిప్రాయపడింది. ఎంత జీతం తగ్గిందో చెప్పండి అంటూ ప్రశ్నించింది.

    ఇదీ చదవండి : ఆ వివాదానికి నా స్నేహితులే కారణం.. క్యాసినో వ్యవహరాంపై వల్లభనేని సంచలన వ్యాఖ్యలు

    పూర్తి డేటా లేకుండా ఎలా పిటిషన్ వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. పీఆర్సీ నివేదిక బయటకు రాకపోతే ప్రభుత్వాన్ని సంప్రదించాలని హైకోర్టు సూచనలు చేసింది. ఉద్యోగులకు జీతాలు పెరిగాయని లెక్కలతో కోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఉద్యోగులకు జీతాలు పెరిగాయి లెక్కలతో కోర్టు తెలిపిన ఏజీ.. ఉద్యోగులకు న్యాయం చేసే దిశగా ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.

    ఇదీ చదవండి : నెల్లూరు అడవుల్లో ‘పుష్ప’ సీన్‌ .. చివరికి ఏం జరిగింది అంటే..?

    ఈ సందర్భంగా ఉద్యోగులు-ప్రభుత్వం సమన్వయంతో పని చేయాలని.. రెండింటి మధ్య సమస్య జఠిలం కాకూడదని న్యాయస్థానం అభిప్రాయపడింది. అందుకే ఉద్యమానికి సిద్ధమైన 12 ఉద్యోగ సంఘాల నేతలను విచారణకు హాజరుకావాలని కోరింది కోర్డు..

    ఇదీ చదవండి : ఆ రెండు జిల్లాల్లో వ్యాప్తికి కారణం అదే.. ఇకపై కఠిన ఆంక్షలు అమలు

    తాజాగా కోర్టు ఆదేశాలపై ఉద్యోగ సంఘాలు తర్జన బర్జన పడుతున్నాయి. తాము అసలు కోర్టులో కేసులు వేయలేదని.. ఇలాంటి అప్పుడు ఎందుకు హాజరు కావాలని ఆలోచిస్తున్నారు. ఒక వేళ హాజరుకాకపోతే పరిస్థితి ఏంటి..? లేదా తమ తరపున అడ్వకేట్స్ ను పంపించితే సరిపోతుందా అని ఆలోచిస్తున్నారు..

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు