Phone Tapping Controversy: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏపీ హైకోర్టు 16 మందికి నోటీసులు జారీ చేసింది. పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నోటీసులు జారీ చేసిన వారి జాబితాలో సీబీఐ, జియో, వోడాఫోన్, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోషియేషన్ అధ్యక్షుడు ఉన్నారు. వీరంతా వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరుకావాలని హైకోర్టు నోటీసుల్లో పేర్కొంది. దీనిపై నాలుగు వారాల్లో సమాధానాలు పంపాలని హైకోర్టు ఆదేశించింది.
అంతకుముందు ఏపీ ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడుతోందని ఆరోపించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర సంస్థల ద్వారా దర్యాప్తు చేయించాలని ఆయన ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని ఆయన ఆరోపించారు. అయితే ఫోన్ ట్యాపింగ్‌పై ఏమైనా ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని.. తాము విచారణ చేపడతామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చంద్రబాబుకు మరో లేఖ రాశారు. ఇక ఈ అంశంపై హైకోర్టులో పిల్ దాఖలు కావడంతో.. దీనిపై న్యాయస్థానం విచారణ చేపడుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.