HOME »NEWS »ANDHRA PRADESH »andhra pradesh high court give green signal to panchayat elections in state another shock to ys jagan government prn

AP Panchayati elections: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.., పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

AP Panchayati elections: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.., పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి హై కోర్టు (High Court) షాకిచ్చింది. పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) పై హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని తీర్పు ఇచ్చింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టు షాకిచ్చింది. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. ఎన్నికలపై స్టే విధుస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హై కోర్టు కొట్టేసింది. కరోనా నిబంధనలు సడలించడంతో అన్నికార్యకలాపాలు సజావుగా సాగుతున్నందున ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన నోటిఫికేషన్ అమలు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై 10 నెలలుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ ప్రభుత్వానికి మధ్య యుద్ధం నడుస్తోంది. కరోనా వైరస్ ను కారణంగా చూపుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ చేసింది.

    ఆ వెంటనే సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను ఎస్ఈసీగా నీయమించింది. దీనిపై కోర్టుకు వెళ్లి విజయం సాదించిన నిమ్మగడ్డ.. మళ్లీ ఛార్జ్ తీసుకున్నారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీనిని నిలువరించేందుకు ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇరుపక్షాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.



    ఈ క్రమంలో సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల కమిటీ.. ఎస్ఈసీతో భేటీ అయింది. ఐతే భేటీ ముగిసిన గంటలోనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను నిమ్మగడ్డ రిలీజ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయగా ఎన్నికల నిర్వహణపై స్టే ఇస్తూ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును నిమ్మగడ్డ డివిజనల్ బెంచ్ లో సవాల్ చేయగా ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిమ్మగడ్డ ఇచ్చిన షెడ్యూల్ యథాతథంగా అమలు చేయాలని తేల్చి చెప్పింది.

    నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా ఉండగా ఎన్నికలు నిర్వహించకూడదని పట్టుబట్టిన ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేసే అవకాశముంది. కరోనా వ్యాక్సినేషన్ కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని  భావిస్తున్న ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు షాకిచ్చింది.  ఐతే హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే  న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం.  ఈ రోజే  హైకోర్టు తీర్పుపై సుప్రీం కౌంటర్ దాఖలు చేసే అవకాశముంది.
    Published by:Purna Chandra
    First published:January 21, 2021, 11:05 IST

    टॉप स्टोरीज