AP HC Different Punisehment to Anantapur DEO: ఆంధ్రప్రదేశ్ లో పలువుర అధికారులు పదే పదే హైకోర్టు చేత తిట్లు తినాల్సి వస్తోంది. ఇటు ప్రభుత్వ పెద్దలు.. అటు కోర్టుల మధ్య చాలామంది నలిగిపోతున్నారు. అందుకే ఇటీవల కోర్టు దిక్కరణ కేసులు కూడా పెరుగుతున్నాయి. వీటిపై గత కొంతకాలంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వస్తోంది. తాజాగా ఏపీలోని విద్యాశాఖ అధికారికి కోర్టు ఓ వింత శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) కె.శామ్యూల్‌కు ఓ వింతశిక్ష విధించింది. ఇంతకీ ఏం జరిగిదంటే..?అనంతపురం జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ పి.వెంకటరమణకు సీనియారిటీ కల్పించే విషయమై 2019లో హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు వెంకటరమణకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఆయనకు సీనియారిటీ కల్పించాలని ఆదేశించింది. కానీ ధర్మాసనం ఆదేశాలను వెంకటరమణ పట్టించుకోలేదు.కోర్టు ఆదేశించినప్పటికీ సీనియారిటీ కల్పించలేదు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఆదేశాలను కూడా పట్టించుకోరా? అంటూ చీవాట్లు వేసింది. దీంతో డీఈవో ధర్మాసనానికి క్షమాపణ చెప్పారు.
కానీ కోర్టు మాత్రం అతని క్షమాపణలు చెబితే సరిపోదని.. కోర్టు చెప్పిన తరువాత కూడా అంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించింది. నిర్లక్ష్యాన్ని మూల్యం తప్పక చెల్లించాలని అభిప్రాయపడింది. అక్కడితోనే ఆగిపోలేదు.. ఓ వింత శిక్ష కూడా విధించింది. 2019లో డీఈవోపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. దీనిపై సోమవారం ఈ పిటిషన్‌ను విచారించింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్, విద్యాశాఖ కమిషనర్ వి. చినవీరభద్రుడు, అనంతపురం డిఇఒ కె శామ్యూల్ సోమవారం కోర్టుకు హాజరయ్యారు. రాజశేఖర్, చినవీరభద్రుడు ఇచ్చిన వివరణలపై కోర్టు సంతృప్తి చెందగా, శామ్యూల్ ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని బాధ్యులుగా గుర్తించింది.
ఇరు వాదనలు విన్న తరువాత.. అధికారి క్షమాపణ చెప్పినా.. న్యాయ స్థానం సరిపోదని భావించింది. న్యాయస్థానం ఆదేశాల అమల్లో ఏడాది జాప్యం చోటుచేసుకున్నందుకు డీఈవోను బాధ్యుడిగా తేల్చింది. చీవాట్లు పెట్టింది. దీంతో డీఈవో కోర్టుకు క్షమాపణ కోరారు. కానీ మీరు చెప్పిన క్షమాపణను ధర్మాసనం అంగీకరించాలంటే వారం రోజులపాటు జిల్లాలోని ఏదైనా వృద్ధాశ్రమంలో కానీ..అనాథాశ్రమంలో కానీ సామాజిక సేవ చేయాలని, వారి భోజన ఖర్చులు భరించాలని ఆదేశించారు. ఇందుకు డీఈవో అంగీకరించారు. ప్రస్తుతం ఈ తీర్పు హాట్ టాపిక్ అయ్యింది. అందరికీ ఇలాంటి శిక్షలు వేయాలని.. అప్పుడైనా కొందరిలో మార్పు వస్తోంది అంటున్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.