హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Corona in Schools: ఆ పాఠశాలలు మూసివేయాల్సిందే... ఏపీ ప్రభుత్వానికి ఆరోగ్య శాఖ కీలక ప్రతిపాదన...

Corona in Schools: ఆ పాఠశాలలు మూసివేయాల్సిందే... ఏపీ ప్రభుత్వానికి ఆరోగ్య శాఖ కీలక ప్రతిపాదన...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో 10 రోజుల క్రితమే నూతన విద్యాసంవత్సరం (Academic Year -2021) ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే పిల్లలు బడిబాట పడుతున్నారు. ఐతే ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో 10 రోజుల క్రితమే నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే పిల్లలు బడిబాట పడుతున్నారు. ఐతే స్కూళ్లు ప్రారంభమైన కొద్దిరోజులకే అక్కడక్కడా విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఏదైనా స్కూల్లో ఒకే రోజు ఐదు పాజిటివ్ కేసులు నమోదైతే.. ఆ స్కూలును మూసివేయాల్సిందేనని స్పష్టం చేసింది. విద్యార్థులు, టీచర్లకు క్వారంటైన్ పూర్తయ్యేవరకు క్లాసులు నిర్వహించవద్దని.., లేదంటే వైరస్ వ్యాప్తి తీవ్రమవుతుందని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. గత ఏడాది ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే పాజిటివ్ కేసులు నమోదైన స్కూళ్లను వెంటనే శానిటైజ్ చేసి ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు చేయాలని సూచించారు. ఆ మేరకు ఆరోగ్యశాఖ అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసిందన్నారు.

అత్యధికంగా కేసులు నమోదవుతున్న పాఠశాలలు తమను సంప్రదిస్తే కరోనా నియంత్రణ చర్యలను వేగవంతం చేస్తామని వైద్యశాఖ ప్రకటించింది. అలాగే హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాల్లలోని విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించే బాధ్యతను వార్డెన్లు, ప్రిన్సిపాళ్లదేనని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అలాగే పాజిటివ్ గా తేలిన వారితో ప్రైమరీ కాంటాక్టులున్నవారందరికీ టెస్టులు నిర్వహించాలని పేర్కొంది. ఇక ఆగస్టు 30 నాటికి అన్ని స్కూళ్లను శానిటైజ్ చేయించాలని వైద్య, ఆరోగ్య శాఖ.., పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు సూచించారు. ప్రతి స్కూల్ ఎంట్రెన్స్ లో థర్మల్ స్క్రీనింగ్ తో పాటు శానిటైజర్ అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

ఇది చదవండి: ఏపీలో భారీగా అంగన్ వాడీ పోస్టుల భర్తీ.. ఇలా అప్లై చేసుకోంది..


సిబ్బందికి సూచనలు...

ఇక ప్రతి స్కూల్లో టీచర్లు, ఇతర సిబ్బందికి రెండు వారాలకు ఒకసారి తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయాలని ఆరోగ్య శాఖ సూచిచింది. చిన్నారుల్లో ఏ మాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే టెస్టులు చేసేలా సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. టెస్టులకు సంబంధించిన సదుపాయలను తామే కల్పిస్తామని వైద్య ఆరోగ్య తెలిపింది. స్కూల్ యాజమాన్యాలు డీఎంహెచ్ఓకి వివారలను ఇస్తే ప్రత్యేక బృందాలతో టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించింది.

ఇది చదవండి: ఇంజనీరింగ్ తెలివి అవినీతిలో చూపించాడు... ఏడాదిలోనే కోట్లలో స్కామ్..


ఇవి తప్పనిసరి..

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిని మాత్రమే స్కూల్ ఆవరణలోకి అనుమతించాలని ప్రభుత్వానికి వైద్యఆరోగ్య శాఖ సూచించింది. అలాగే క్యాంపస్ లో మాస్కు తప్పనిసరి చేసింది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో పాటు తల్లిదండ్రులకు కూడా టీకా తప్పనిసరి చేస్తూ మార్గద ర్శకాలను జారీ చేయాలని కోరింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్కు ఈ నిబంధనలు వర్తింపజేయాలని సూచించింది. ఇప్పటికే 6లక్షల మంది టీచర్లకు, నాన్ టీచింగ్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చామని.. కనీసం ఒక్క డోసు సైతం తీసుకోని వారు వెంటనే తమను సంప్ర దించాలని హెల్త్ ఆఫీసర్లు స్పష్టం చేశారు.

First published:

Tags: Andhra Pradesh, AP Schools, Corona virus, Health department

ఉత్తమ కథలు