ఏపీలో వానలే వానలు, మూడు నెలల్లో 42 శాతం అధిక వర్షపాతం

ప్రతీకాత్మక చిత్రం

Southwest monsoon season 2020: కరువు సీమగా పేరొందిన రాయల సీమ జిల్లాల్లో ఈసారి నైరుతి రుతుపవనాలు కరుణించాయి. 

  • Share this:
    Andhra Pradesh Rain Data |  ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా వానలు కురుస్తున్నాయి. గడిచిన మూడు నెలలు (జూన్ 1, 2020 నుంచి ఆగస్టు 26, 2020) వరకు 42 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 2020లో ఇప్పటి వరకు నైరుతి రుతుపవనాలు (సాధారణంగా జూన్ 1 నుంచి లెక్కిస్తారు) బాగానే ప్రభావం చూపాయి. ఇప్పటి వరకు 42 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే 20 శాతం వర్షపాతం తక్కువ నమోదైంది. విజయనగరం, విశాఖ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. కరువు సీమగా పేరొందిన రాయల సీమ జిల్లాల్లో ఈసారి నైరుతి రుతుపవనాలు కరుణించాయి. ఏపీలో అత్యధికంగా సాధారణం కంటే 94 శాతం అధిక వర్షపాతం చిత్తూరు జిల్లాలో నమోదైంది. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 94 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. కర్నూలు (77శాతం), కడప (67 శాతం)లో కూడా భారీగానే వర్షాలు పడ్డాయి. నెల్లూరు జిల్లాలో 66 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 60 శాతం అధికంగా వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలో (-3 శాతం), విజయనగరంలో ( -4) శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. అయితే, సాధారణ వర్షపాతం కంటే కొంచెం తక్కువ కాబట్టి, దీన్ని పెద్దగా పరిగణించరు.

    ఏపీలో నమోదైన వర్షపాతం వివరాలు, జిల్లాల వారీగా
    Published by:Ashok Kumar Bonepalli
    First published: