నేడు ఏపీలో గ్రూప్ -2 స్క్రీనింగ్ టెస్ట్... 447 పోస్టులు... ఒక్కో పోస్టుకీ 660 మంది పోటీ

Group 2 Screening Test : 447 పోస్టుల కోసం దాదాపు 3 లక్షల మంది పోటీ పడుతున్నారు. అంటే ఒక పోస్టు కోసం 660 మంది పోటీ పడుతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 5, 2019, 5:57 AM IST
నేడు ఏపీలో గ్రూప్ -2 స్క్రీనింగ్ టెస్ట్... 447 పోస్టులు... ఒక్కో పోస్టుకీ 660 మంది పోటీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
APPSC చేసే గ్రూప్ -2 పరీక్షకు నేడు (మే 5) స్క్రీనింగ్ టెస్ట్ జరపబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 447 పోస్టుల కోసం 2,95,036 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందుకోసం APPSC అధికారులు 13 జిల్లాల్లో 727 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల కోసం సెంటర్ల కేటాయింపు, రూట్ మ్యాప్‌ల తయారీ, లైజాన్, అసిస్టెంట్ లైజాన్, చీఫ్ సూపరింటెండెంట్ అధికారులను ప్రత్యేకంగా నియమించారు. పరీక్షా కేంద్రాల దగ్గర అవసరమైన మౌలిక సదుపాయాల కోసం రెవెన్యూ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను సమన్వయం చేస్తూ విస్తృత ఏర్పాట్లు చేశారు. అలాగే భద్రతా పరంగా పటిష్ట ఏర్పాట్లు చేసిన అధికారులు... పోలీసుల సేవలను సెంటర్ల దగ్గర ఎక్కువగా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.

వివిధ ప్రాంతాల నుంచీ పరీక్షలకు వచ్చే అభ్యర్థుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని సిద్ధం చేసింది. డైరెక్టుగా పరీక్షా కేంద్రాల దగ్గరకే వాటిని నడుపుతోంది. పరీక్ష జరిగేటప్పుడు కరెంటు పోకుండా విద్యుత్‌ శాఖ అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు.

స్క్రీనింగ్ టెస్ట్‌కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

* OMR షీట్ ద్వారా జరిపే ఈ స్క్రీనింగ్ టెస్ట్‌లను ఇంగ్లీషులో నిర్వహిస్తున్నారు. అందువల్ల OMR షీట్ పాడవకుండా జాగ్రత్త పడాలని అభ్యర్థులకు అధికారులు సూచించారు.


* OMR షీట్ పాడైతే దాన్ని స్కానర్ సరిగా గుర్తించదనీ, అందుకే OMR షీట్‌ను ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాలని కోరారు.
* పరీక్షకు వచ్చే అభ్యర్థులు బ్లూ, బ్లాక్ పెన్నుల్ని మాత్రమే వాడాలి.
* అభ్యర్థులు తప్పని సరిగా ఓరిజినల్ ఐడీ కార్డులతో వెళ్లాలి.* గ్రూప్ -2 స్క్రీనింగ్ టెస్టులో నెగిటివ్ మార్కులుంటాయి. రాంగ్ అన్సర్ చేస్తే 1/3 మార్కులు కట్ అవుతాయి.
* జీవో నెంబర్ 365 ప్రకారం మాస్ కాపీయింగ్‌‌కి పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు.
* ఎండాకాలం కాబట్టి వడదెబ్బ తగలకుండా అభ్యర్థులు బాగా వాటర్ తాగాలి. అందుకు తగిన ఏర్పాట్లు పరీక్షా కేంద్రాల్లో ఉన్నాయి.
First published: May 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>