Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH GRAMA WARD VOLUNTEERS DEMAND CM YS JAGANMOHAN REDDY TO HIKE SALARIES LIKE RATION DELIVERY VEHICLE DRIVERS BA GNT

Volunteers: గ్రామ వాలంటీర్ల సంచలన డిమాండ్లు.. సీఎం జగన్ ముందు భారీ చిట్టా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్)

నిన్న, మొన్న ఏర్పాటు చేసిన రేషన్ డీలర్ల ఆందోళనకు వెంటనే సీఎం జగన్ ఓకే చెప్పడంతో ఇప్పుడు వాలంటీర్లు ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో వాలంటీర్ల సమావేశం అయ్యారు.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో తలనొప్పి వచ్చింది. నిన్నటి వరకు ఇంటింటికీ రేషన్ డెలివరీ చేసే వాహనాల డ్రైవర్లు ఆందోళన చేశారు. తమకు డ్రైవర్‌ ఉద్యోగం అని చెప్పి మొత్తం పనులన్నీ చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఒక్కో రేషన్ డెలివరీ వాహనదారుడికి ప్రతి నెలా రూ.16 వేలు చెల్లిస్తున్నారు. వాటిలో అద్దె కింద రూ.10 వేలు, పెట్రోల్‌ కోసం రూ.3 వేలు, హెల్పర్‌ చార్జీల కోసం రూ.3 వేలు కేటాయించారు. ఐతే ఆ డబ్బు సరిపోవడం లేదని, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని సీఎం జగన్ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే వారికి నెలనెలా ఇస్తున్న రూ.15వేలను రూ.21వేలకు పెంచారు. వాహనాల అద్దెను రూ.10వేల నుంచి 13 వేలు, వాహనదారుడి సహాయకుడికి చెల్లించే హెల్పర్ చార్జీలను రూ.3 వేల నుంచి రూ.5వేలు, పెట్రోల్ ఖర్చులను రూ.3 నుంచి రూ.5వేలకు పెంచారు.

    నిన్న, మొన్న ఏర్పాటు చేసిన రేషన్ డీలర్ల ఆందోళనకు వెంటనే సీఎం జగన్ ఓకే చెప్పడంతో ఇప్పుడు వాలంటీర్లు ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో వాలంటీర్ల సమావేశం అయ్యారు. తమకు నెలకు రూ.5వేలు ఇచ్చి అన్ని పనులు చేయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలను ప్రభుత్వం పట్టించుకోడంలేదని ఆవేదన చెందారు. 2019 నుంచి పనిచేస్తున్న తమకు జీతం పెంచకుండా రేషన్ వాహనాల డ్రైవర్లకు పెంచారని అలక వహించారు. తమకు కూడా వేతనాలు పెంచాలని, ఉద్యోగాలు క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమబాట పడతామని వాలంటీర్లు హెచ్చరించారు.

    ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రభుత్వం తీసుకొచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు వీరిని తీసుకొచ్చారు. వారికి నెలకు రూ.5వేల గౌరవ వేతనం ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 50 కుటుంబాలను కేటాయించారు. ఆ 50 కుటుంబాలకు ప్రభుత్వం నుంచి లభించే పథకాలను చేరవేస్తారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ పెద్ద ఎత్తున మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కరోనా వైరస్ సమయంలో గ్రామాలు, పట్టణాల్లో కొత్తగా ఎవరు వస్తున్నారు, వారి ఆరోగ్య పరిస్థితులు ఏంటి? ఒకవేళ కరోనా వస్తే వారిని ఆస్పత్రికి తరలించేందుకు సాయం చేయడం ద్వారా గ్రామ, వార్డు వాలంటీర్ల పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, తమ చేత చాలా పనులు చేయిస్తున్నా.. కేవలం రూ.5వేలు మాత్రమే ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు వార్డు, గ్రామ వాలంటర్లకు ప్రతి ఏటా రెన్యువల్ ఉంటుంది. వారి పనితీరు ఆధారంగా రెన్యువల్ చేస్తారు. ఒకవేళ ఏదైనా తప్పులు చేస్తే తీసేసే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉంటుంది.

    ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు రావడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామ, వార్డు వాలంటీర్లు అందరినీ ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించారు. వారికి ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లను కూడా తీసుకోవాలని ఆదేశించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Gram volunteer, Ward Volunteers

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు