గ్రామ సచివాలయ పరీక్ష పేపర్ లీక్ ? ఏపీలో దుమారం

సచివాలయ పరీక్షల్లో గూడూపుఠాణి నడించిందని, కొందరికి లబ్ధి చేకూరేలా ప్లాన్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

news18-telugu
Updated: September 20, 2019, 4:07 PM IST
గ్రామ సచివాలయ పరీక్ష పేపర్ లీక్ ? ఏపీలో దుమారం
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలను విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
news18-telugu
Updated: September 20, 2019, 4:07 PM IST
ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాలపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రశ్నాపత్రాన్ని లీక్‌చేసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. క్వశ్చన్ పేపర్‌ని ఏపీపీఎస్సీ తయారు చేసిందని.. ఆ టీమ్‌లో పనిచేసిన ఓ మహిళ గ్రామ సచివాలయ పరీక్ష రాసిందని ఆరోపణలున్నాయి. పరీక్షల్లో ఆమెనే టాపర్‌గా నిలిచందని పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆమె కుటుంబ సభ్యుల్లో మరో ఇద్దరు కూడా టాపర్లగా నిలిచారని విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయ పరీక్షల్లో గూడూపుఠాణి నడించిందని, కొందరికి లబ్ధి చేకూరేలా ప్లాన్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశం ఏపీలో ప్రకంపనలు రేపుతోంది.

ఈ ఆరోపణలపై ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టిపారేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక పరీక్షను ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించామని స్పష్టంచేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొంత మంది అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి.. పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించామన్నారు. ప్రశ్నాపత్రం బయటకు వచ్చే అవకాశమే లేదని స్పష్టంచేశారు.


First published: September 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...