హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Graduate MLC Result: వైసీపీకి మూడు వార్నింగ్ లు ఇచ్చిన ఎమ్మెల్సీ ఫలితాలు.. అలర్ట్ అవ్వాల్సిందేనా..?

Graduate MLC Result: వైసీపీకి మూడు వార్నింగ్ లు ఇచ్చిన ఎమ్మెల్సీ ఫలితాలు.. అలర్ట్ అవ్వాల్సిందేనా..?

వైసీపీకి గ్రాడ్యుయేట్స్ వార్నింగ్

వైసీపీకి గ్రాడ్యుయేట్స్ వార్నింగ్

MLC Graduate Result: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార వైసీపీకి ఊహించని షాక్ తగిలింది.. మూడు రాజధానులు మా విధానం అంటున్న వైసీపీకి.. చదువుకున్న వారు షాకిచ్చారు. ముఖ్యంగా విశాఖను రాజధాని చేస్తామని అధికార పార్టీ చెబుతుంటే.. అక్కడి ఓటర్లే వైసీపీని తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Graduate MLC Result:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు.. అధికార వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చాయి.. మూడుంటికి మూడు స్థానాల్లో వన్ సైడ్ విక్టరీ సాధిస్తామని వైసీపీ మంత్రులు (YCP Ministers).. నేతలు అంతా నమ్మకంగా చెప్పారు. అంతేకాదు పోలింగ్ సమయంలోనూ.. ప్రచారాలు సాగిన సమయంలోనూ వైసీపీ ఎక్కవగా కనిపించింది. అసలు టీడీపీ (TDP) పోటీ చేస్తున్నట్టు కూడా ఎక్కడా హంగామా లేదు.. కానీ ఫలితాలు మాత్రం టీడీపీ వారే ఊహించని విధంగా వచ్చాయని చెప్పొచ్చు.. ఇప్పటికే రెండు ఎమ్మెల్సీ ల్లోనూ టీడీపీ జయకేతనం ఎగురవేయగా.. పశ్చిమ రాయల సీమ ఫలితం హోరాహోరీగా సాగుతోంది.. ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో అది కూడా నెగ్గి తీరుతామని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

మూడు రాజధానులకు ఉత్తరాంధ్ర ప్రజల మద్దతు లేదా?

తాజా ఎన్నికల ఫలితాలను చూస్తే అలానే అనిపిస్తోంది. ఎందుకంటే విశాఖన పరిపాలనా రాజధానిగా చేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)  సహా.. మంత్రులు పదే పదే చెబుతున్నారు. ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit) లోనూ జగన్ అదే మాట చెప్పారు. త్వరలో విశాఖ (Visakha)కు షిప్ట్ అవుతున్నాను అని అన్నారు. అంతేకాదు మూడు రాజధానుల ప్రభావం.. ఉత్తరాంధ్రలో బలంగా ఉందని.. ఆ సెంటిమెంట్ తమకు బాగా కలిసి వస్తుందని.. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రను క్లీన్ స్వీప్ చేస్తామని వైసీపీ చెబుతూ వస్తోంది.

కానీ తాజాగా ఉత్తరాంధ్ర వేదికగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఓటర్లు ఊహించని షాకిచ్చారు. ప్రభుత్వం చెబుతున్న మాటలను చదువుకున్నవారు విశ్వసించలేదని ఈ ఫలితం తేల్చి చెప్పేసింది. అంతేకాదు ఇటీవల గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని.. విశాఖ రూపు రేఖలు మారిపోతున్నాయి అంటూ మంత్రులు ఊదరగొట్టారు.. ఆ హామీలను యువత నమ్మినట్టు కనిపించలేదు. నాలుగేళ్లలో సాధ్యం కానిది ఈ ఏడాదిలో చేస్తామంటే ప్రజలు నమ్మే అవకాశం లేదన్నది వైసీపీ నేతలకు ఈ ఫలితంతో తెలిసొచ్చింది అంటున్నారు.

ఇదీ చదవండి : యువగళం పాదయాత్రలో అపశ్రుతి.. లోకేష్ కు గాయాలు? ఏం జరిగింది అంటే?

ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత:

ఇక రెండోది ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత.. అయితే సీఎం జగన్ సహా మంత్రులు అంతా.. తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని చెబుతున్నారు. బటన్ నొక్కి పారదర్శకంగా పథకాలు అందిస్తున్నామని.. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి లబ్ధి దారుడికి నేరుగా అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని.. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని.. అలాంటప్పుడు వ్యతిరేకత ఎక్కడ ఉంటుందని వైసీపీ నేతలు తిరిగి ప్రశ్నిస్తున్నారు. అయితే వారి అంచనా తప్పని పట్టభద్రుల ఎన్నిక సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా యువత, చదుకున్న వారిలో ఎక్కవ మంది శాతం ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారు అన్నది ఈ ఫలితం ద్వారా తెలిసింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అసలు పోటీలో లేదు అనుకున్న టీడీపీని కేవలం ప్రభుత్వ వ్యతిరేకతే గెలిపించింది అన్నది వారి లెక్క.. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి వ్యతిరేకత తగ్గించుకోకపోతే.. సాధరాణ ఎన్నికల్లోనూ షాక్ లు తప్పకపోవచ్చు అంటున్నారు.

ఇదీ చదవండి : సీఎం జగన్ లెక్క తప్పిందా? 175కి 175 సాధ్యమా? అంతర్మథనంలో వైసీపీ నేతలు

పొత్తుల లెక్కలు కలిసి వచ్చాయా..?

మూడోది పొత్తులు కలిసి వచ్చాయన్న ప్రచారం. వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి పొత్తులపై ఆందోళన చెందుతూనే ఉంది. స్వయంగా సీఎం జగన్ సైతం దమ్ముంటే ఒక్కరే 175 స్థానాల్లో పోటీ చేయండి అని చంద్రబాబు నాయుడు, పవన్ కు సవాల్ విసిరారు. అంటే ఆ రెండు పార్టీలు కలిస్తే.. నష్టం తప్పదని జగన్ అంచనాకి వచ్చారనే సంకేతాలు గట్టిగా ప్రజల్లోకి వెళ్లింది. అంతేకాదు తాజా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అది కనిపించింది. బీజేపీకి మొదటి ప్రధాన్యత ఓటు వేసిన వారంతా.. తమ రెండో ప్రాధాన్యత ఓటు టీడీపీకి వేశారు. ఇక జనసైనికులు సైతం.. తమతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి కాకుండా టీడీపీ అభ్యర్థులకే వేశారు. ఇక వామపక్షలు.. ఇతర సంఘాల ఓట్లు కూడా మొదటి ప్రాధాన్య ఓటు పీడీఎఫ్ కు వేసినా.. రెండో ప్రాధాన్య ఓటు టీడీపీకే వేశారు అన్నది అంచనా.. ఈ ఎన్నికల్లో పొత్తు వర్కౌట్ అవ్వడంతో.. సాధారణ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలు ఇదే సూత్రం ఫాలో అయ్యే అవకాశాలు లేకపోలేదు.. నిజంగా టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే.. వైసీపీ తప్పక అలర్ట్ అవ్వాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP Politics, TDP, Ycp

ఉత్తమ కథలు