Andhra Pradesh : వారి కుటుంబంలో ఒక‌రికి ప్ర‌భుత్వ‌ ఉద్యోగం.. ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ లోగో

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వం కోవిడ్ ద్వారా మృతి చెందిని ప్ర‌భుత్వ ఉద్యోగుల కుటుంబాల‌కు గుడ్ న్యూస్ చెప్పింది.. ఆ కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రికి కారుణ్య నియామ‌కాల కింద వెంట‌నే ఉద్యోగం క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

  • Share this:
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వం కోవిడ్ ద్వారా మృతి చెందిని ప్ర‌భుత్వ ఉద్యోగుల కుటుంబాల‌కు గుడ్ న్యూస్ చెప్పింది.. ఆ కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రికి కారుణ్య నియామ‌కాల కింద వెంట‌నే ఉద్యోగం క‌ల్పించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి (YS Jaganmohan Reddy) అధికారుల‌ను ఆదేశించారు. ఈ ప్ర‌క్రియ న‌వంబ‌ర్ 30, 2021 నాటిక‌ల్ల పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా రాష్ట్రంలో 176 కొత్త పీహెచ్‌సీ (PHC)ల నిర్మాణంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. జనవరిలో వీటి పనులు ప్రారంభించి 9 నెలల్లోగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. జాతీయ ప్రమాణాలను అనుసరించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకాలు ఉండాలని, ఇందులో రాజీకి ఆస్కారం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్ (Vaccination), ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకాలు, కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, హెల్త్‌హబ్స్‌ (Health Hub) పై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

    ఈ అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.  సమీక్షలో ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర త‌దిత‌రు అధికారులు పాల్గొన్నారు.

    Andhra Pradesh : ఇక్క‌డ పెళ్లి క‌ళ‌.. దుబాయ్‌లో గోల్డ్ జిగేల్‌.. ఆంధ్ర‌లో మొద‌లైన పెళ్లిళ్ల‌ సీజ‌న్ డిసెంబ‌ర్‌లోపు 29 ముహుర్తాలు


    పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు..
    వివిధ ఆస్పత్రుల్లో గుర్తించిన ఖాళీలు, అవసరాల మేరకు నియామకాల క్యాలెండర్‌ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 20న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. డీపీహెచ్‌ఎఫ్‌డబ్ల్యూలో పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి డిసెంబర్‌ 10న నియామక ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. డీఎంఈలో పోస్టులకు డిసెంబర్‌ 5న నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఏపీవీవీపీలో పోస్టులకు అక్టోబరు 20 నుంచి 23 వరకూ నోటిఫికేషన్లు జారీ చేసి డిసెంబర్‌ 21 – 25 మధ్య నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికారులు పేర్కొన్నారు.

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వెలువ‌డ్డ నోటిఫికేష‌న్ వివ‌రాలు..


    నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు..
    ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Andhra Pradesh Public Service Commission) ఖాళీల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Notification) విడుదల చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ప‌లు విభాగాల్లో నాన్ గ‌జిటెట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా అసిస్టెంట ప‌బ్లిక్ రిలేష‌న‌ల్ ఆఫీస‌ర్లు (Public Relational Officers), అసిస్టెంట్ స్టాటిస్టిక్ ఆఫీస‌ర్‌, ఫుడ్‌సేఫ్టీ ఆఫీస‌ర్ వంటి త‌దిత‌ర 38 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

    హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలు..
    ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ విభాగాల్లో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది ఏపీపీఎస్‌సీ. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ విభాగంలో డీపీఆర్‌వో, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్, లెజిస్లేచర్ సర్వీస్‌లో తెలుగు రిపోర్టర్, హార్టికల్చర్ సర్వీస్‌లో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది.
    Published by:Sharath Chandra
    First published: