గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చారు..ఏపీ సర్కార్‌పై చంద్రబాబు విమర్శలు

Andhra Pradesh Covid-19 | రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరిగిపోయాయని తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ఆరోపించారు. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

news18-telugu
Updated: September 3, 2020, 8:10 PM IST
గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చారు..ఏపీ సర్కార్‌పై చంద్రబాబు విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
  • Share this:
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరిగిపోయాయని తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థత కారణంగా గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కరోనా కట్టడి విషయంలో జనవరి మాసంలోనే ప్రభుత్వం అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుని ఉంటే....నేటి పరిస్థితి ఏర్పడేది కాదని అభిప్రాయపడ్డారు. కరోనా బాధిత కుటుంబాలు, కరోనా విజేతలు, వైద్యనిపుణులతో చంద్రబాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని...కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొంటోందన్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో పేషంట్ దగ్గర నుంచి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. కొందరు డాక్టర్లు కరోనా రోగులను దోచుకోవడంతో అందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు. కరోనా మరింత వ్యాపించకుండా ప్రజలను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


కరోనా పురిటిగడ్డ చైనాలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడగా...మిగిలిన యావత్ ప్రపంచం కరోనా కారణంగా సతమతమవుతోందని వివరించారు. కరోనా కారణంగా చాలామంది జీవితాలు తారుమారయ్యాయన్నారు. చేతివృత్తులు, కులవృత్తులు, భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి ప్రతి కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. అలాగే క్యారంటైన్‌‌లో ఉన్న రోగులకు గతంలో చెప్పిన మేరకు రూ.2వేల నగదు ఇవ్వాలన్నారు. కరోనా బాధితులకు అందరూ బాసటగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
Published by: Janardhan V
First published: September 3, 2020, 8:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading