బెజవాడ -సింగపూర్ విమాన సర్వీస్ రద్దు చేసిన జగన్ సర్కార్

జూలై 9 నుంచి సింగపూర్‌ విమాన సర్వీసును రద్దు చేశారు. అధికారులు ఆన్‌లైన్‌ బుకింగ్‌ను కూడా నిలిపివేశారు.

news18-telugu
Updated: June 29, 2019, 7:19 AM IST
బెజవాడ -సింగపూర్ విమాన సర్వీస్ రద్దు చేసిన జగన్ సర్కార్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.తాజాగా ఏపీలోని జగన్ సర్కార్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. విజయవాడ నుంచి సింగపూర్‌కు నడిచే విమాన సర్వీసును రద్దు చేసింద. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) విధానంలో నడుస్తున్న ఈ సర్వీసులకు ఈనెల 30తో కాంట్రాక్ట్ గడువు ముగుస్తోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఈ ఒప్పందాన్ని సమీక్షించాల్సి ఉండగా... అందుకు ప్రస్తుత సీఎం జగన్ ఆసక్త చూపలేదని తెలుస్తోంది. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) నుంచి ఈ మేరకు ఈమెయిల్‌ రావటంతో.. ఇండిగో సంస్థ సింగపూర్‌ సర్వీసును రద్దు చేయాల్సిందిగా ఇక్కడి ప్రాంతీయ అధికారులకు సమాచారం పంపింది.  దీంతో జూలై 9 నుంచి సింగపూర్‌ విమాన సర్వీసును రద్దు చేశారు. అధికారులు ఆన్‌లైన్‌ బుకింగ్‌ను కూడా నిలిపివేశారు.
Published by: Sulthana Begum Shaik
First published: June 29, 2019, 7:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading