హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ ఇదే, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ ఇదే, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయనే వాదన ఉంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగింది. దీంతో మద్యం ధరలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయనే వాదన ఉంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగింది. దీంతో మద్యం ధరలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

AP Liquor Policy: ప్రస్తుతం రాష్ట్రంలో 2934 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వమే నిర్వహిస్తోంది. వాటిని మరో ఏడాది పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

AP Excise Policy: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎక్సైజ్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2934 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఈ 2934 మద్యం దుకాణాలను మరో ఏడాది పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఏడాదికి 20 శాతం చొప్పున మద్యం దుకాణాలను తగ్గిస్తూ ఐదు సంవత్సరాల్లో మద్యపాన రహిత రాష్ట్రంగా ఏపీని మార్చాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్ వరకే మద్యాన్ని పరిమితం చేసేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. కానీ, తాజాగా ప్రకటించిన ఎక్సైజ్ పాలసీలో మద్యం దుకాణాల తగ్గింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లాక్ డౌన్ తర్వాత మద్యం దుకాణాలు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో 13 శాతం మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. కానీ, తాజాగా ప్రకటించిన ఎక్సైజ్ పాలసీలో మద్యం దుకాణాల తగ్గింపు ప్రస్తావన చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం.

Illegal liquor, tungabadra river, telangana crime news, andhra Pradesh crime news, illegal liquor trade, మద్యం అక్రమ రవాణా, తుంగభద్ర నది, క్రైమ్ న్యూస్
ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి అక్రమంగా మద్యం రవాణా (File)

తాజాగా జారీ చేసిన ఎక్సైజ్ పాలసీ ప్రకారం తిరుపతి రైల్వే స్టేషన్-అలిపిరి మార్గంలో లిక్కర్ షాపులకు అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, తిరుపతి బస్టాండ్, లీలామహాల్ సెంటర్ , నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం వంటి ప్రాంతాల్లో లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధించింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ అనుమతితో లిక్కర్ మాల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే, ప్రభుత్వం నిర్దేశించిన 2,934 దుకాణాల పరిధికి లోబడే లిక్కర్ మాల్స్ ఉండాలని స్పష్టం చేసింది.

andhra Pradesh, Machilipatnam, liquor bottles destroyed, Liquor telangana to andhra, AP Liquor rates, Telangana liquor rates, మచిలీపట్నంలో మద్యం బాటిళ్లు ధ్వంసం, తెలంగాణ టు ఏపీ మద్యం అక్రమ రవాణా, ఏపీ వార్తలు, ఏపీ న్యూస్,
మచిలీపట్నంలో మద్యం బాటిళ్లను రోడ్ రోలర్ తో తొక్కిస్తున్న దృశ్యం

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు భారీగా ఉన్నాయి. పెద్దగా గుర్తింపులేని మద్యం బ్రాండ్లకు భారీ ఎత్తున ధరలు ఉన్నాయనే అభిప్రాయం మద్యం ప్రియుల్లో ఉంది. లాక్ డౌన్ తర్వాత మద్యం దుకాణాలు తెరిచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం మద్యం ధరలను పెంచింది. అయితే, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి అక్రమ మద్యం రవాణా పెరిగింది. ఏపీతో బోర్డర్ కలిగి ఉన్న తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రాలో మద్యం ధరలు ఎక్కువగా ఉండడంత పొరుగు రాష్ట్రాల నుంచి చాలా మంది మద్యాన్ని అక్రమంగా ఏపీలోకి తరలిస్తున్నారు. దీన్ని కట్టడి చేయడం పోలీసు శాఖకు, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు చాలా తలనొప్పిగా మారింది.

ఏపీలో మద్యం ధరల్లో మార్పులు చేస్తూ సెప్టెంబర్ 3న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు

మరోవైపు హైకోర్టు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. మూడు బాటిళ్ల విధానాన్ని కూడా కొందరు మందుబాబులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 3న రాష్ట్రంలో మద్యం ధరల్లో మార్పులు చేసింది. క్వార్టర్ మద్యం ధర రూ.150 కంటే తక్కువ ఉంటే వాటి ధరలను తగ్గించింది. క్వార్టర్ (180 ఎంఎల్) మద్యం ధర రూ.190 కంటే ఎక్కువ ఉంటే వాటి ధరలను పెంచింది.

First published:

Tags: Andhra Pradesh, Liquor policy, Liquor sales, Liquor shops

ఉత్తమ కథలు