హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Governor Health: ఏపీ గవర్నర్ కు అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపు..

AP Governor Health: ఏపీ గవర్నర్ కు అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపు..

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (ఫైల్)

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (ఫైల్)

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. అధికారులు వెంటనే ఆయన్ను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (AP Governor Biswabhushan Harichandan) అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం తీవ్ర ఆనారోగ్యానికి గురికావడంతో అధికారులు వెంటనే ఆయన్ను విజయవాడ (Vijayawada) నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ (Hyderabad) కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిపుణులైన డాక్టర్ల బృందం గవర్నర్ కు చికిత్స అందిస్తోంది. మధ్యాహ్నం లోగా గవర్నర్ బెల్త్ బులిటెన్ ను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కరోనా  దృష్ట్యా కొంతకాలంగా గవర్నర్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇటీవల కాస్త అస్వస్థతకు గురైనా ఆ తర్వాత కోలుకున్నారు. తాజాగా మరోసారి ఇబ్బంది తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయన్ను హైదరాబాద్ తరలించారు.

First published:

Tags: Andhra Pradesh, AP governor viswabhushan

ఉత్తమ కథలు