హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh Budget: ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. వరసగా మూడోసారి

Andhra Pradesh Budget: ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. వరసగా మూడోసారి

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర చరిత్రలో వరుసగా మూడుసార్లు ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

ఆంధ్రప్రదేశ్ లో వరసగా మూడో ఏడాది ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ అమల్లోకి వచ్చింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. గవర్నర్ ఆమోదంతో మూడు నెలల కాలానికి సంబంధించిన ఆర్డినెన్స్ ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జూన్ నెలాఖరు వరకు దాదాపు రూ.86వేల కోట్ల వరకు బడ్జెట్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఐతే ఓటాన్ ఎకౌండ్ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించింది. వరుసగా మూడో ఏడాది ప్రభుత్వం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 2019లో ఎన్నికల సందర్భంగా ఓటాన్ ఎకౌంట్ పడ్జెట్ ప్రవేశపట్టారు. గత ఏడాది కరోనా కారణంగా పూర్తిస్థాయి బడ్జెట్ రాలేదు. ఈ ఏడాది పంచాయతీ ఎన్నికల కారణంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేదని.. అందువల్ల ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ను ఆమోదించినట్లు ప్రభుత్వం తెలిపింది. నూతన ఆర్ధిక సంవత్సరంలో ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు, చెల్లింపులకు ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ తప్పనిసరి కావడంతో ప్రభుత్వం ఆమోదించింది.

ఇదే తొలిసారి..

ఏపీ రాష్ట్ర చరిత్రలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆమోదించడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ మూడు నెలల కాలానికి ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ఆమోదించింది. 2020-21లో కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేదు. దీంతో మూడు నెలల కోసం ఓటాన్ ఎకౌంట్ కు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇక ప్రస్తుత 2021-22 ఆర్ధిక సంవత్సరంలోన పంచాయతీ ఎన్నికలు పూర్తిస్థాయి బడ్జెట్ కు అవకాశం రాలేదు. దీంతో మూడు నెలల కాలానికి ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చింది.

ఇది చదవండి: విద్యార్థులకు కరోనా సోకితే ఏం చేయాలి...? విద్యాసంస్థలకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలువరుసగా రెండోసారి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్డినెన్స్‌ రూపంలో వైసీపీ ప్రభుత్వం ఇవ్వటాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. పూర్తి స్థాయి బడ్జెట్‌ సమావేశాలు లేదా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు. తిరుపతి ఉప ఎన్నిక, పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సాకుతో బడ్జెట్‌ సమావేశాలు వాయిదా వేయటం పలాయనవాదమని ఆయన ధ్వజమెత్తారు.

వార్షిక బడ్జెట్‌ను కూడా ఆర్డినెన్స్‌ రూపంలో తెచ్చే దుష్ట సంప్రదాయానికి జగన్‌రెడ్డి శ్రీకారం చుట్టాడం దారణమన్నారు యనమల. ప్రభుత్వానికి ప్రజలు, ప్రతిపక్షాలు, చట్టసభలంటే లెక్కే లేదని విమర్శించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి కుంటిసాకులు చూపి బడ్జెట్‌ వాయిదా వేయలేదన్నారు. గతంలోనూ ఇదే తరహాలో తెచ్చిన మొక్కుబడి బడ్జెట్‌తో పాటు 3 రాజధానుల బిల్లును శాసనమండలి వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో మమ అనిపించుకున్నారని మండిపడ్డారు.

First published:

Tags: Andhra Pradesh, Budget 2021

ఉత్తమ కథలు