Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH GOVERNMENT WILL DOOR DELIVER INSURANCE SCHEMES THROUGH GRAM WARD VOLUNTEERS FULL DETAILS HERE PRN

Andhra Pradesh: వాలంటీర్ల చేతికే మరికొన్ని పథకాలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) పలు సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ అందిస్తోంది.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ సరుకులతో పాటు పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలను గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ చేరవేస్తోంది. ప్రతినెల పెన్షన్లను డోర్ డెలివరీ చేస్తున్న వాలంటీర్లకు మరికొన్ని పథకాలను ఇంటిదగ్గరే అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు రకాల బీమా పథకాల అమలలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నాలుగు పథకాల క్లెయిములను 30 రోజుల్లో పరిష్కరించాలను ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాల అమలు చేసే బాధ్యతను జిల్లా జాయింట్ కలెక్టర్లకు అప్పగించింది. వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పరిహారం, రైతు ఆత్మహత్యలకు చెల్లించే పరిహారం, వైఎస్ఆర్ పశునష్ట పరిహారం అమలు బాధ్యలు ఇచ్చింది. ప్రభత్వం అందించాల్సిన బీమా క్లెయిముల పరిష్కారంలో జాప్యం జరగడాన్ని గమనించిన ప్రభుత్వం.. ఈ మేరకు మార్పులు చేసింది. క్లెయిముల పరిష్కారం కోసం జేసీలు ప్రతి 15 రోజులకు ఒకసారి జిల్లా, మండల స్థాయి అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి కలెక్టర్ కు నివేదిక ఇవ్వాలి.

    అలాగే కలెక్టర్ ఈ పథకాలపై ప్రతి నెలా సమీక్షించి గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్‌ నెలవారీ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించింది. బీమా పథకాలు సజావుగా సకాలంలో అమలవుతున్నాయా లేదా అనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది.

    ప్రభుత్వం అందించే బీమా పథకాలు ఇవే..

    వైఎస్ఆర్ బీమా :
    పేద కుటుంబాలకు పెద్దదిక్కుగా ఉండే సంపాదించే వ్యక్తి 18 నుంచ 50 ఏళ్ల వయసులోపు ఉండి సహజంగా మరణిస్తే వారికి రూ.లక్ష ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. అలాగే 18 నుంచి 70 ఏళ్ల వయసులోపు వారు ప్రదవశాత్తూ మరణించినా.. లేక శాస్వత వైకల్యానికి గురైనా రూ.5లక్షల పరిహారాన్ని ప్రభుత్వం నేరుగా బాధిత కుటుంబానికి చెల్లిస్తుంది.

    ఆత్మహత్య చేసుకున్న రైతులకు
    వ్యవసాయ సంబధిత కారణాలతో రైతులు, కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడితే ఆ రైతు కుటుంబానానికి పరిహారం కింద రూ.7లక్షలు చెల్లిస్తారు.

    వైఎస్ఆర్ మత్స్యకార భరోసా
    చేపల వేట జీవనాధారంగా జీవించే మత్స్యకారులు 18 నుంచి 60ఏళ్ల వయసులోపు వారు ప్రమాదవశాత్తూ మరణిస్తే ఈ కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది.

    వైఎస్ఆర్ పసునష్ట పరిహారం పథకం
    ఈ పథకం కింద గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు మరణిస్తే ప్రభుత్వం నిర్ధారించిన పరిహారాన్ని చెల్లించాలి. ఈ పథకాలకు సంబంధించిన నగదును పూర్తిస్థాయి పరిశీలన అనంతరం గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించనున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap welfare schemes, Gram volunteer

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు