ANDHRA PRADESH GOVERNMENT WARNS DOCTORS ABOUT THEIR ATTENDANCE AND FACILITIES IN HOSPITALS FULL DETAILS HERE PRN
AP News: డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ పై ఏపీ సర్కార్ సీరియస్.. బయోమెట్రిక్ వేయకుంటే యాక్షన్ తప్పదు..
ఎంటీ కృష్ణబాబు
ప్రభుత్వాస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే వైద్యుల హాజరు, సౌకర్యాలు, మందుల కొరతపై విమర్శలువస్తుంన్నందున ఆయా అంశాల్లో లోపాలు సరిదిద్దేందుకు ముందుకెళ్తోంది.
ప్రభుత్వాస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే వైద్యుల హాజరు, సౌకర్యాలు, మందుల కొరతపై విమర్శలువస్తుంన్నందున ఆయా అంశాల్లో లోపాలు సరిదిద్దేందుకు ముందుకెళ్తోంది. ముఖ్యంగా వైద్యుల పనితీరు, అంబులెన్సులు, వైద్య పరికరాలతో పాటు ఇతర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ఎం.టి. కృష్ణబాబు జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న పరికరాలు, అంబులెన్సుల వంటివి ఏ మేరకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలన్నఆయన. రుయా ఘటన నేపథ్యంలో ఆర్డీవో, డియస్పీలతో కూడిన కమిటీలు తగు నిర్ణయాలు తీసుకోవాలని.., ప్రైవేట్ వాహనాల మాఫియా ను అడ్డుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో పనిచేయాల్సిన సిబ్బంది కంటే 30 నుండి 40 శాతం తక్కువ సిబ్బంది పనిచేస్తున్నారని.. పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నా ఫలితం కనిపించడంలేదని చెప్పారు. కలెక్టర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్ లు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఇక ఆస్పత్రుల్లో డాక్టర్లు హాజరును తప్పనిసరిగా పరిగణలోకితీసుకుంటామన్న కృష్ణబాబు.. ఈనెలాఖరులోగా బయోమెట్రిక్ హాజరును నూటికి నూరు శాతం పూర్తి చెయ్యాలని ఆదేశించారు. ఏదో సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చెయ్యొద్దని హెచ్చరించారు. ఫీల్డ్ లెవల్ సిబ్బంది బయోమెట్రిక్ హాజరు విషయమై కూడా సంబంధిత హెచ్వోడీలు ప్లాన్ చేసుకోవాలన్నారు. హాజరు కోసం రిజిస్టర్ అయ్యిందీ లేనిదీ ఎపివివిపి, డిహెచ్, డిఎంఇలు ఎప్పటికప్పుడు నివేదికలివ్వాలని చెప్పారు. హాజరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని.. చర్యలు తప్పవని కృష్ణబాబు హెచ్చరించారు. ప్రతి ఉద్యోగీ నిర్ణీత సమయానికి అసుపత్రిలో ఉండాల్సిందనని స్పష్టం చేశారు.
ఆస్పత్రుల్లో మందుల కొనుగోలుకు రూ.650 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని.. ఇది దాదాపు రెట్టింపు మొత్తమని.. ఎక్కడా మందుల కొరత రావడానికి వీల్లేదని కృష్ణబాబు తెలిపారు. మందుల కోసం ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు డిమాండ్ ను రెయిజ్ చేస్తే వెనువెంటనే నిధులొస్తాయన్నారు.
ఆసుపత్రులలో కింది స్థాయి సిబ్బంది నియామకాల్లో నిబంధనల్ని సడలిస్తామన్న ఆయన.., ఎక్కడా ఖాళీలుండకూడదన్నారు. ఆసుపత్రులలో ఆరోగ్య శ్రీ నిధులన్ని వేరే అవసరాలకు వాడొద్దని.., అత్యవసర నిధులు, సర్జికల్స్ కోసం వాడితే ఉపయుక్తంగా ఉంటుందని సూచించారు. నిర్దేసిత సమయానికల్లా కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తికావాల్సిందేనని చెప్పారు. మే 24 తర్వాత పంపించే కోవిడ్ పరిహారాల చెల్లింపు కోసం 90 రోజులు పడుతుందన్నారు. పేదలందరికీ పూర్తి స్థాయిలో వైద్య సేవలందాలనీ సీఎం పదేపదే చెప్తున్నారని.. ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషన్ జె.నివాస్ పాల్గొన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.