Home /News /andhra-pradesh /

Governemt Vs Tollywood: వరదలు మంచెత్తితే టాలీవుడ్ ఎక్కడుంది..? టికెట్లు మాత్రం పెంచాలా..? వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Governemt Vs Tollywood: వరదలు మంచెత్తితే టాలీవుడ్ ఎక్కడుంది..? టికెట్లు మాత్రం పెంచాలా..? వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్స్

టాలీవుడ్ స్టార్స్

ycp mla slams tollywood heroes: ఏపీ లో సినిమా టికెట్లు ప్రభుత్వమే ఆన్ లైన్ లో అమ్మే విధానంపై దుమారం రేగుతోంది. రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలని స్టార్ హీరోలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో.. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తి ఉంటే.. హీరోలు ఎక్కవ ఉన్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే నిలదీస్తున్నారు..?

ఇంకా చదవండి ...
  AP Government vs Tollywood:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వర్సెస్ టాలీవుడ్ (Tollywood) వివాదం మరింత ముదురుతోంది.  సినిమా టికెట్ల ధరలపై (AP Movie Tickets Issue) వివాదం మరో మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నా.. వైసీపీ ప్రభుత్వం తగ్గేదే లేదు అంటూ ముందుకు వెళ్తోంది.  ఏపీ ప్రభుత్వం (AP Government) తీసుకొచ్చిన చట్టసవరణతో అదనపు షోలు రద్దు కావడంతో పాటు టికెట్ ధరలు కూడా తగ్గించనున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) సినిమా టికెట్ల ధరలపై పునరాలోచించుకోవాలని శుక్రవారం ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ (CM YS Jagan) కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.  తాజాగా  బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.  ఏపీ ప్రభుత్వం ఇలాగా ముందుకు వెళ్తే థియేటర్లు మూతపడతాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

  ప్రభుత్వం తీరుపై టాలీవుడ్ పెద్దలు విమర్శలు చేస్తుంటే.. స్టార్ హీరోల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే. నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చాలా జిల్లాలు వరదలతో అతలాకుతలం అయ్యాయని.. మరి ఇలాంటి సమయంలో టాలీవుడ్ హీరోలు స్పందించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల అభిమానం వల్లే హీరోలు అయిన వాళ్లు.. ఇప్పుడు ప్రజలు కష్టాల్లో, బాధల్లో ఉంటే స్పందించకపోవడం బాధాకరమన్నారు.

  ఇదీ చదవండి: రోజాకు ఆత్మ గౌరవం లేదా..? కన్నీరు పెట్టినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదని చంద్రబాబుకు బొత్స ప్రశ్న

  చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా ఒక్కరు కూడా వరద ప్రజల గురించి ఒక్క స్టేట్‌మెంట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఆరోపించారు.  ప్రజల సమస్యలపై స్పందించరు కాని సినిమా టికెట్ల రేట్లు పెంచమని డిమాండ్ చేయడంలో ముందుంటారు అంటూ పరోక్షంగా విమర్శించారు.

  ఇదీ చదవండి: ఏపీలో టమాట దొంగలున్నారు జాగ్రత్త.. పక్కా స్కెచ్ తో వందల కిలోల టమాటాలు మాయం

  గతంలో ప్రజలకు ఎప్పుడైనా అనుకోని విధంగా కష్టాలు వస్తే సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ వెంటనే స్పందించి రోడ్డు మీదకు వచ్చి జోలె పట్టి సహాయం చేసేవారని నల్లపురెడ్డి గుర్తుచేశారు. అందుకే ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్లు అని అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న హీరోలు సినిమాల్లో నటిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారని.. వారిని హీరోలను చేసిన ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

  ఇదీ చదవండి: కరివేపాకు పేరుతో అమెజాన్‌లో గంజాయి దందా.. విశాఖ టు మధ్య ప్రదేశ్ వయా అమెజాన్..

  ఇప్పటికైనా హీరోలు స్పందించి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏదో ఒక సాయం చేయాలని నల్లపురెడ్డి పిలుపునిచ్చారు. హీరోలు సంపాదించిన దాంట్లో కొంచెమైనా ప్రజలకు సాయం చేయాలని ఆయన హితవు పలికారు. మరోవైపు నిర్మాతలు, దర్శకులు కూడా స్పందించాలని తాము కోరుతున్నామని నల్లపురెడ్డి పేర్కొన్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, AP News, Tollywood, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు