Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH GOVERNMENT USED THIS EDITED CRISTIANO RONALDO PIC FOR COVID 19 AWARENESS SRD

Cristiano Ronaldo : ఏపీ సర్కార్ వాడకం మాములుగా లేదుగా..ఏకంగా రొనాల్డో ఫోటోతో మెసేజ్..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Cristiano Ronaldo : ఏపీ సర్కార్ లేటెస్ట్ గా రొనాల్డోను ఫోటోని ఉపయోగించుకుని ప్రజలకు ఓ మంచి మెసేజ్ ఇచ్చింది. ఇంతకీ ఏపీ సర్కార్ ఇచ్చిన ఆ మెసేజ్ ఏంటి..?

    ఈ కరోనా సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి పట్టునే ఉండి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. దాంతో పాటుగా బయటకి వెళ్ళినప్పుడు మాస్కు ధరించాలి. అలానే సోషల్ డిస్టెన్స్ పాటించాలి. బయటికి వెళ్లి వచ్చిన వెంటనే శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా క్లీన్ చేయాలి. ఇదిలా ఉంటే ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా మాస్కు ధరించి, వాళ్ళకి దూరంగా ఉండాలి. నిజంగా కరోనా వచ్చిన వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఇప్పుడు ఆస్పత్రిలో అడ్మిట్ అవడానికి కూడా భయంగా ఉంటోంది. ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత వంటివి కూడా మనం చూస్తున్నాం. దీంతో వైద్యం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి మన చేతుల్లో ఉన్నది మనం చేస్తూ ఉండాలి.సరిగ్గా మాస్క్ ధరించడం వల్ల సురక్షితంగా ఉండొచ్చు. రెండు మాస్కులు ధరించడం కూడా మంచి పద్ధతి. దీని వల్ల కరోనా బారిన పడకుండా ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పటికే చాలా మంది రెండు మాస్కులు ధరించడాన్ని అలవాటు చేసుకున్నారు. ఇక, ఈ విషయాన్ని ప్రభుత్వాలు చెబుతున్నా..ప్రజల్ని సరిగ్గా ఆచరించడం లేదు. కరోనా నిబంధనల్ని తుంగలో తొక్కి..ఇతరులకు వైరస్ వ్యాప్తి అయ్యేలా చేస్తున్నారు.

    ఇక, ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వం చాలా తెలివిగా చెప్పింది. క్రిస్టియానో రొనాల్డో లేటెస్ట్ కోకకోలా ఇష్యూ ఫోటోను ఉపయోగించుకుని మాస్క్ వాడమని అర్ధం వచ్చేలా ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ తెగ వైరల్ గా మారింది. మీ ముక్కులు, మూతి, గడ్డం కవరయ్యేలా మాస్క్ ధరించండి అనే ఉద్దేశం వచ్చేలా క్యాప్షన్ వచ్చింది.


    ఇక, పోర్చుగ‌ల్ స్టార్ సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఓ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సాఫ్ట్ డ్రింక్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న కోకకోలా బ్రాండ్‌ డ్రింక్ తగొద్దు అంటూ ప్రెస్ మీట్‌ లో ప్రకటించాడు. మీడియా స‌మ‌యంలో అత‌ని ముందు రెండు సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ కనిపించాయి. వాటిని చూసిన వెంటనే తీసి ప‌క్క‌న పెట్టేశాడు. ఇది ప‌క్క‌నే కూర్చున్న కోచ్ శాంటోస్‌తోపాటు మీడియాను కూడా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మొత్తానికి అతని చర్యతో కోకాకోలా కంపెనీ భారీ నష్టాల్ని చవిచూసింది. ఏకంగా 29 వేల కోట్ల నష్టాల్ని మూటగట్టుకుంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, Corona mask, Cristiano Ronaldo, Euro Cup 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు