ANDHRA PRADESH GOVERNMENT TRANSFERRED TTD JEO BASANTH KUMAR FOR PARTICIPATING IN STATE ELECTION COMMISSIONER NIMMAGADDA RAMASH KUMAR TIRUMALA TOUR PRN
Andhra pradesh: నిమ్మగడ్డను కలిసిన ఎఫెక్ట్.. కీలక అధికారిపై ప్రభుత్వం వేటు
ఆదిత్యానాథ్ దాస్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (Andhra Pradesh Government), రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (AP SEC Nimmagadda Ramesh Kuamr) నెలకొన్న వివాదంలో అధికారులు చిక్కుల్లో పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నెలకొన్న వివాదంలో అధికారులు చిక్కుల్లో పడుతున్నారు. తన ఆదేశాలు పాటించడం లేదంటూ ఇప్పటికే ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అధికారులపై నిమ్మగడ్డ వేటు వేశారు. కొందర్ని ట్రాన్స్ ఫర్ చేయించారు. ఏకంగా సీఎంఓ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ నే ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆర్డర్స్ పాస్ చేశారు. నిమ్మగడ్డ వ్యవహారంలో గుర్రుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతోంది. అవసరం లేకపోయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిశారన్న నెపంతో టీటీడీ జీఈవో బంతత్ కుమార్ పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన్ను జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
గురువారం (ఫిబ్రవరి 4) చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈసమయంలో నిమ్మగడ్డతో పాటు టీటీడీ జేఈవో బసంత్ కుమార్ కూడా నిమ్మగడ్డతో పాటు వెళ్లారు. బసంత్ కుమార్ తన పరిధిలో లేకపోయినా నిమ్మగడ్డ పర్యటనలో పాల్గొనడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. నిమ్మగడ్డను కలిసిన 24గంటల్లోనే ఆయన్ను ట్రాన్స్ ఫర్ చేసింది. ఎక్కడా పోస్టింగ్ కల్పించకుండా జీఏడీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. బసంత్ కుమార్ ను బదిలీ చేసిన ప్రభుత్వం.. నెల్లూరు జిల్లా ఎన్నికల అభ్జర్వర్ గా కొనసాగవచ్చని పేర్కొంది.
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదుల సంఖ్యలో అధికారులను బదిలీ చేశారు. తొలుత ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణి మోహన్ ను ప్రభుత్వానికి సరెండర్ చేసిన ఆయన ఆతర్వాత గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు శామ్యూల్ ఆనంద్ కుమార్, భరత్ నారాయణ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డితో పాటు కొందరు పోలీస్ అధికారులను బదిలీ చేశారు. అనంతరం ఎన్నికల ఏర్పాట్లలో విఫలమయ్యారంటూ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ పై అభిశంసన ప్రతిపాదనలు చేశారు. ఇటీవలే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో ఏకగ్రీవమైన మండలాలకు సంబంధించిన ఎంపీడీవోలను బదిలీ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అటు ఎస్ఈసీ, ఇటు ప్రభుత్వం ఆధిపత్య పోరులో అధికారులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నికలు పూర్తయ్యేనాటికి మరెన్ని బదిలీలు, మార్పులు చేర్పులు ఉంటాయో చూడాలి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.